తడకమళ్ల వేంకట కృష్ణారావు

తడకమళ్ల వేంకట కృష్ణారావుతొలి తెలుగు నవలాకారుడు. నరహరి గోపాలకృష్ణమచెట్టి రాసిన సోనాబాయి పరిణయము(1873),కందుకూరి వీరేశలింగం నవల రాజశేఖర చరిత్ర(1866)కు ముందే కంబుకంధర చరిత్ర(1830-60)అనే నవలను రచించాడు.

జీవిత విశేషాలు మార్చు

కృష్ణారావు నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో జన్మించారు.కంబుకంధర చరిత్రను ఆయన వచన ప్రబంధంగా చెప్తారు. ఐతే 19వ శతాబ్ధంలో నవల ప్రబంధంగానే వ్యవహరించబడింది. కాబట్టి కథానిక లాగానే నవల రచన తెలంగాణలోనే బీజం పడిందని చరిత్రకారుల అంచనా.[1] 1866లో అతను రాసిన ‘కంబుకంధర చరిత్ర’లో తొలి తెలుగు నవలా మూలాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. [2] తెలుగు గణిత గ్రంథకర్తల్లో అతను గుర్తింపు పొందిన వాడు. ఆయన కూడా పద్యాల్లో ‘ఆంధ్ర లీలావతి’ రాశాడు.[3]

మూలాలు మార్చు

  1. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం. ఆచార్య ఎస్వీ రామారావు
  2. "నవలావనంలో తొలినాళ్ల వెన్నెల". www.teluguvelugu.in. Archived from the original on 2021-01-26. Retrieved 2020-09-12.
  3. "గణితానికీ సాహితీ సువాసన". www.teluguvelugu.in. Archived from the original on 2020-08-05. Retrieved 2020-09-12.