తాండవ నది తూర్పు కనుమలలో పుట్టి, తునికి సమీపంలో ఉన్న పెంటకోట దగ్గర సముద్రంలో కలుస్తుంది. తుని దగ్గర ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దు.ఈ నదికి కుడి ఒడ్డున తుని పట్టణం, ఎడమ ఒడ్డున పాయకరావుపేట పట్టణాలు ఉన్నాయి.ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి.ఇది తుని పట్టణానికి 10 కి.మీ.దూరంలో ఉంది.ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దుగా ఏర్పడింది.అందువలన నీటిని నియంత్రించటానికి తునికి ఎగువన 1965 -1975 మధ్యకాలంలో ఈ నదిపై శ్రీ రాజా సాగి సూర్యనారాయణ రాజు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టును అనే పేరులో ఆనకట్ట నిర్మించి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ప్రాజెక్టు క్రింద విశాఖపట్నం జిల్లాలోని నాథవరం, నర్శీపట్నం, కోట ఉరట్ల గ్రామాలకు చెందిన 32689 ఎకరాలు, తూ.గో. జిల్లాలోని కోటనందూరు, తుని. రౌతులపూడి గ్రామాలకు చెందిన 18776 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీటి సౌకర్యం కలిగింది.[1]

తునికి సమీపంలో తాండవ నది

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=తాండవ_నది&oldid=2985800" నుండి వెలికితీశారు