తాంసీ మండలం
తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా లోని మండలం
తాంసీ మండలం | |
---|---|
Mandal of Telangana | |
Coordinates: 19°41′15″N 78°25′23″E / 19.6875°N 78.423139°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాదు జిల్లా |
Area | |
• మొత్తం | 97 km2 (37 sq mi) |
Population (2011)[2] | |
• మొత్తం | 39,631 |
• Density | 410/km2 (1,100/sq mi) |
వివరాలు | |
• పురుషులు | 19615 |
• స్త్రీలు | 20016 |
• లింగ నిష్పత్తి | 1020 |
తాంసీ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[3]తాంసీ, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంక వివరాలు మార్చు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 39,631 - పురుషులు 19,615 - స్త్రీలు 20,016. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 97 చ.కి.మీ. కాగా, జనాభా 16,584. జనాభాలో పురుషులు 8,125 కాగా, స్త్రీల సంఖ్య 8,459. మండలంలో 3,943 గృహాలున్నాయి.
వ్యవసాయం, పంటలు మార్చు
తాంసి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 18044 హెక్టార్లు, రబీలో 467 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, వరి.[5]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 31 (ముప్పైఒక్క) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మూలాలు మార్చు
- ↑ పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ జిల్లాలు, మండలాల జన గణాంకాలు, Wikidata Q111728792
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 97