తిలోత్తమ (సినిమా)

తిలోత్తమ 1951, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు జానపద సినిమా. మీర్జాపురం రాజా దర్శకత్వంలో ఈ సినిమా శోభనాచల పిక్చర్స్ బేనర్‌పై నిర్మించబడింది.

తిలోత్తమ
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం మీర్జాపురం రాజా
నిర్మాణం మీర్జాపురం రాజా
తారాగణం అంజలీదేవి,
అక్కినేని నాగేశ్వరరావు,
సూర్యప్రభ
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

సంక్షిప్త కథ మార్చు

 
తిలోత్తమలో సూర్యప్రభ

పూలమాలలు కట్టుకుని జీవించే దేవదత్తుడు (అక్కినేని నాగేశ్వరరావు) అనే అందగాడిని వసంతసేన (సూర్యప్రభ) అనే వేశ్య, దేవలోకంలోని అప్సరస తిలోత్తమ (అంజలీదేవి), ఆమె అంశతోనే భూలోకంలో రాజకుమారిగా పుట్టిన తిలోత్తమ(అంజలీదేవి) ప్రేమిస్తారు. స్వర్గలోకంలోని తిలోత్తమ ఇంద్రజాలానికీ, ఆమెను ప్రేమించిన గంధర్వుని శాపానికీ దేవదత్తుడు గురి అవుతాడు. గంధర్వుని శాపం ఫలితంగా స్వర్గలోక తిలోత్తమ, దేవదత్తుడు కిరాతక రూపాలు ధరించి తమ జన్మవృత్తాంతాలు మరిచిపోయి ఉంటారు. ఆ స్థితిలో దేవదత్తుడు తన భార్య అయిన కిరాతకి వంధ్యత్వం పోగొట్టటం కోసం తనవల్లనే భూలోక తిలోత్తమకు కలిగిన బిడ్డను కాళికి బలి ఇస్తాడు. కాళి ప్రత్యక్షమై అందరి కష్టాలు కడతేర్చి బిడ్డను బతికిస్తుంది. స్వర్గలోక తిలోత్తమ స్వర్గానికి పోగా, దేవదత్తుడు భూలోక తిలోత్తమతోను, వసంతసేనతోను సుఖంగా జీవిస్తాడు[1].

మూలాలు మార్చు

  1. సంపాదకుడు (28 February 1951). "శోభనాచల వారి "తిలోత్తమ" చిత్రసమీక్ష". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 43 (24): 24, 48. Retrieved 29 December 2019.[permanent dead link]