తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించడం జరుగుతుంది.


2015లో రాష్ట్ర స్థాయిలో 32 విభాగాల్లో 52 మందికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో మండల స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు 5,780 మందిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కారాల కింద 7 కోట్ల 52 లక్షల 70 వేలు అందజేసింది.[1]

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2015, జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా జ్ఞాపిక, లక్షా 116 రూపాయల నగదు పురస్కార గ్రహీతలకు లక్షా 116 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ధ్రువీకరణ పత్ర ప్రదానం జరిగింది.

ఉత్తమ గ్రామ పంచాయతీగా కరీంనగర్‌ జిల్లా లోని చందుర్తి, ఉత్తమ మండలంగా మెదక్‌ జిల్లా లోని సిద్దిపేట, ఉత్తమ మున్సిపాలిటీగా ఆదిలాబాద్‌ జిల్లా లోని మంచిర్యాలను అవార్డుల కమిటీ ఎంపిక చేయడం జరిగింది.[2]

పురస్కార గ్రహీతలు మార్చు

క్రమసంఖ్య పేరు రంగం స్వస్థలం
1 కె. పాండురంగాచార్య వేపండితుడు హైదరాబాదు
2 ముదిగొండ వీరభద్రయ్య సాహితీవేత్త హైదరాబాదు
3 గూడ అంజయ్య సాహితీవేత్త హైదరాబాదు
4 సలావుద్దీన్‌ సయ్యద్‌ సాహితీవేత్త హైదరాబాదు
5 సుంకిరెడ్డి నారాయణరెడ్డి సాహితీవేత్త నల్లగొండ జిల్లా
6 పోల్కంపల్లి శాంతాదేవి సాహితీవేత్త వనపర్తి
7 పెద్దింటి అశోక్ కుమార్ సాహితీవేత్త కరీంనగర్‌
8 ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల ఆధ్యాత్మిక వేత్త
9 మహమ్మద్‌ ఉస్మాన్‌ మక్కా మసీదు ఇమాం జనాబ్‌
10 ఏలె లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ లోగో రూపకర్త
11 ఎక్కా యాదగిరిరావు అమరవీరుల స్థూప నిర్మాత
12 కె. లక్ష్మాగౌడ్‌ చిత్రకారుడు
13 కళాకృష్ణ కళాకారులు హైదరాబాదు
14 అలేఖ్య పుంజాల శాస్త్రీయ నృత్యం హైదరాబాదు
15 టంకశాల అశోక్‌ జర్నలిస్ట్‌ హైదరాబాదు
16 డాక్టర్‌ పసునూరి రవీందర్ ఉత్తమ ఎలక్ట్రానిక్‌ విూడియా జర్నలిస్ట్‌ హైదరాబాదు
17 హైదరాబాద్ బ్రదర్స్ సంగీతకారులు హైదరాబాదు
18 విఠల్‌ రావు గజల్‌ గాయకుడు
19 జి.ఎల్‌. నామ్‌దేవ్‌ ఉద్యమ సంగీతం కరీంనగర్
20 ఆచార్య నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి సంస్కృత పండితుడు వరంగల్ జిల్లా
21 చుక్కా సత్తయ్య జానపద కళలు జనగాం
22 వంగీపురం నీరజాదేవి కూచిపూడి నృత్యం వనపర్తి
23 గోపన్నగారి శంకరయ్య అర్చకులు హైదరాబాదు
23 సుధాకర్‌రెడ్డి న్యాయకోవిదులు హైదరాబాదు
24 చందుర్తి గ్రామ పంచాయతీ కరీంనగర్ జిల్లా
25 సిద్ధిపేట మండలం మండలం సిద్ధిపేట జిల్లా
26 డా.సి.హెచ్.మోహన్‌రావు శాస్త్రవేత్త
27 నర్రా రవి ఎంటర్‌ప్రెన్యూర్
28 ప్రొ. శ్రీధరస్వామి విద్యావేత్త వరంగల్ జిల్లా
29 ముఖేశ్ క్రీడాకారుడు రంగారెడ్డి జిల్లా
30 ముళినీరెడ్డి క్రీడాకారుడు హైదరాబాద్
31 డా. రాజారెడ్డి వైద్యుడు హైదరాబాద్
32 డా. ఆర్. లక్ష్మణమూర్తి వైద్యుడు వరంగల్
33 దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ ఎన్‌జీవో హైదరాబాద్
34 భరత్ భూషణ్ ఫొటోగ్రఫీ హైదరాబాద్
35 అయల అనంతాచారి హస్తకళలు పెంబర్తి, జనగాం జిల్లా
36 కందకట్ల నర్సింహులు చేనేత హైదరాబాద్
37 ఇ. పద్మ అంగన్‌వాడీ కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు
38 మాటల తిరుపతి ఉద్యమ గాయకుడు
39 యోధన్ ఉద్యమ గాయకుడు ఆదిలాబాద్ జిల్లా
40 భూక్యా సుశీల ఉద్యమ గాయకురాలు
41 ఎం.వి. రమణారెడ్డి శిల్పి మెదక్ జిల్లా
42 ఎన్. విజయశ్రీ ఉపాధ్యాయురాలు జీపీహెచ్‌ఎస్ నాదర్‌గుల్, రంగారెడ్డి జిల్లా
43 బండా ప్రతాపరెడ్డి ఉపాధ్యాయుడు సీనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ మాసబ్‌ట్యాంక్
44 బి. పద్మారావు ప్రభుత్వ ఉద్యోగి ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ (వరంగల్)
45 పి. అనూరాధారెడ్డి వారసత్వ కట్టడాల పరిరక్షణ హైదరాబాద్
46 డా. ఎం.పాండురంగారావు వారసత్వ కట్టడాల పరిరక్షణ వరంగల్
47 డా. జై శెట్టి రమణయ్య చరిత్ర పరిశోధన కరీంనగర్ జిల్లా
48 కర్ర శశికళ ఉత్తమ రైతు దుగ్గేపల్లి, త్రిపురారం, నల్లగొండ జిల్లా
49 వొల్లాల రమేశ్ ఉత్తమ రైతు భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా పాడిపరిశ్రమ
50 మంచిర్యాల ఉత్తమ మున్సిపాలిటీ ఆదిలాబాదు జిల్లా

మూలాలు మార్చు

  1. జనంసాక్షి, హైదరాబాదు (31 May 2015). "50 మందికి ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 10 October 2020. Retrieved 13 October 2021.
  2. సాక్షి, తెలంగాణ (31 May 2015). "రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం". Sakshi. Archived from the original on 19 December 2015. Retrieved 12 October 2021.