తోట లక్ష్మి కాంతం రావు

1970 ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో జన్మించిన తోట లక్ష్మీకాంతరావు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ నుండి తన M.A, M.phil, Ph.D నీ పూర్తి చేసి మీడియా రంగంతో తను ప్రతిక్ష జీవితాన్ని మొదలుపెట్టారు .

మొదటి నుంచి సమాజం పట్ల దేశ రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్న లక్ష్మీకాంతరావు ఎల్లప్పుడు తాను ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నారు.

విద్యార్థిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన NSUI లో చేరి అందులో క్రియాశీలక కార్యకర్తగా ఎదుగుతూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలను పొందారు.

ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న లక్ష్మీకాంతరావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అనేక పదవులు అధిరోహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీని పట్టిష్టం చేయడంలోనూ అభివృద్ధి పరచడంలోనూ ఎంతో ముఖ్యపాత్ర పోషించారు లక్ష్మీకాంతరావు.

పటిపట్ల అంకితభావాన్ని తన నిబద్ధతను, సమాజంలో తన వృత్తి జీవితాన్ని తను చేసిన సేవ, సామాజిక కార్యక్రమాలు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతనకు జుక్కల్ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.

2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీలో ముందున్నారు లక్ష్మీకాంతరావు.

నియోజకవర్గంలోని బలమైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో పాటు లక్ష్మీకాంతరావు నిర్వహించిన సేవ, సామాజిక కార్యక్రమాలు అతను గెలుపుకు ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి .


మూలాలు మార్చు

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.