అసలు దస్త్రం(2,441 × 2,441 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 1.28 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ

The Chenchus are referred to as one of the Primitive Tribal Groups that are still dependent on forests and do not cultivate land but hunt for a living. Non-tribe people living among them rent land from the Chenchus and pay a portion of the harvest

చెంచులు-జీవన విధానం:

ఆంధ్రదేశంలోని అరుదైన గిరిజన తెగలలో చెంచులు ఒకరు.వీరు నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు,నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాలలో వ్యాపించి ఉంటారు.

చెంచుల వర్గీకరణ:

చెంచులను నాలుగు వర్గాలుగా వర్గీకరించారు.అవి

1.అడవి చెంచులు.

2.దేవ చెంచులు.

3.బొంత చెంచులు.

4.కృష్ణ చెంచులు.


వీరిలో అడవి చెంచులు, దేవ చెంచులు నల్లమల ప్రాంతంలో,బొంత చెంచులు, కృష్ణ చెంచులు లోతట్టు పల్లపు ప్రాంతాలలో నివసిస్తుంటారు.బొంత చెంచులు మాట్లాడే భాషను 'బొంతకోర్ 'అని అంటారు.చెంచు స్త్రీలు గృహోపకరణాలను మరియు వెదురు నిచ్చెనలను తయారు చేసి గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు అమ్మి వచ్చిన ఆదాయంతో జీవిస్తారు.

ఒక్కొక్క గోత్రంకు చెందిన చెంచులు తేనె తీసుకునేందుకు ఒక్కో ప్రాంతాన్ని కేటాయించుకుని రాత్రి పూటల్లో తేనె ను సేకరిస్తారు.తేనె సేకరించడానికి వెళ్ళినపుడు బావామరదుల్ల్ని వెంట తీసుకువెళతారు.అన్నదమ్ములను మాత్రం తీసుకువెళ్ళరు.ఎందుకంటే వీరిలో అన్న చనిపోయినపుడు అతని భార్యను తమ్ముడు వివాహం చేసుకునే ఆచారం ఉంది.ప్రతీ గూడెంకు ఒక హద్దు ఉంటుంది. ఒక గూడెంకు ఉన్న హద్దులోకి వేరొక గూడెం వారు రారు.

చెంచుల ఆరాధ్య దైవాలు:

చెంచులు వారి సొంత దేవుళ్ళతో పాటుగా నరసింహస్వామి మరియు భ్రమరాంబ,మల్లికార్జున స్వాములను ఆరాధ్య దైవాలుగా కొలుస్తారు.నరసింహ స్వామి సతీమణి అయిన చెంచు లక్ష్మి వీరి తెగకు చెందినదిగా చెప్పుకుంటారు.దీనికి ఆధారం అహెూబిలం దేవాలయ కుడ్యాల మీద చెక్కబడిన ప్రతిమలు మరియు శ్రీశైల దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో చెంచుల పాత్ర.

చెంచులు దర్శించే ముఖ్యమైన యాత్రా స్థలాలు :

1.శ్రీశైలం.

2.మహానంది.

3.అహెూబిలం.

చెంచుల ఆచారవ్యవహారాలు:

వివాహ కార్యక్రమాలు:

చెంచుల వివాహ నిశ్చయ కార్యక్రమం పెండ్లి కుమార్తె ఇంట్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెండ్లి కుమారుడితో పాటుగా అతని తల్లిదండ్రులు, తొమ్మిది మంది పెద్దలు కన్యాదాత ఇంటికి వస్తారు.ఇరువర్గాలకు మరియు పెద్దలకు సమ్మతి అయిన తరువాత పెండ్లి నిశ్చయమైనట్లు ప్రకటించి అందరూ కలిసి సారాయి త్రాగుతారు.దీనితో పెండ్లి నిశ్చయ తంతు ముగుస్తుంది.

చెంచుల పెండ్లి తంతు రెండురోజులు జరుగుతుంది. ముందురోజు పెండ్లి కుమారుని ఇంటి ముందు అడవి నుండి తెచ్చిన కట్టెలు, ఆకులూ మరియు పూలతో ఆకర్షణీయ పందిళ్ళు వేస్తారు.వధూవరులను ఒకే పందిరి క్రింద కూర్చుండబెడతారు.చెంచులలో నేటికీ కట్నాలు లేవు.పెండ్లి మెుదటిరోజు మరియు రెండో రోజు యాటను కోసి భోజనంతో పాటుగా ఒక్కొక్కరికి ఒక సీసా సారాయిని ఇస్తారు.చెంచు గూడెంలో తక్కువ కుటుంబాలు ఉన్నందున ఏ కుటుంబంలో పెండ్లి జరిగినా ఆ గూడెంలో ఉన్న మెుత్తం కుటుంబాలను పెండ్లికి పిలుస్తారు.

వితంతు వివాహం:

చెంచులలో భర్త చనిపోతే రెండో పెండ్లి చేసుకునే పద్దతి ఉంది.25 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న స్త్రీలు భర్త చనిపోయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెకు ఇష్టమైతే రెండో పెళ్ళి చేసుకోవచ్చు.

కుటుంబ వ్యవస్థ:

చెంచుల కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు ఉండవు.వివాహం జరిగిన వెంటనే విడిగా కాపురం పెట్టుకుంటారు.చాలా కుటుంబాలలో వివాహానికి పూర్వమే మగవాడు ఒక గుడిసెను ఏర్పాటు చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.చెంచులు స్వేచ్ఛను కోరుకునే మనస్తత్వం కలవారు.స్త్రీలు నెలసరి వచ్చినపుడు వారు నివాసం ఉంటున్న గుడిసెకు దూరంగా ఉండే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తారు.

కర్మకాండ:

చెంచుగూడెంలో ఏ వ్యక్తి చనిపోయినా గూడెంలో ఉన్న మెుత్తం జనాభా ఆ రోజున చనిపోయినా వారి ఇంటికి వచ్చి దహన సంస్కారాలు జరిగే వరకూ ఉంటారు.చెంచు గూడెంలలో చనిపోయిన వారిని పూడ్చడం లేదా కాల్చడం వంటివి అడవిలో చేస్తుంటారు.దహనం చేసిన తర్వాత ఒక్కో గూడెంలో ఒక్కోలా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు కర్మకాండ నిర్వహిస్తారు. అన్నం,కూరలు,మాంసం,చుట్టలు,సారాయి, రొట్టెలు మెుదలైనవి పిండంతో పాటుగా పెడతారు.కర్మకాండను చనిపోయిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు నిర్వహిస్తాడు.

గూడెం పెద్ద:

ప్రతి చెంచు గూడెంకు ఒక పెద్ద మనిషి ఉంటాడు.ఇతడిని గూడెంలోని వారందరూ కలసి ఎన్నుకుంటారు.గూడెంకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటుగా ఇతర గూడెంకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటుగా ఇతర గూడెం వారితో సత్సంబంధాలు నెరపడం వంటివి కూడా చేస్తుంటాడు.గూడెంలో ఏ విధమైన శుభ కార్యం జరిగినా ఆయన తప్పనిసరిగా హాజరై ఆశీర్వచనాలు అందజేస్తాడు.కర్మకాండలు జరిగినపుడు ప్రధాన పాత్ర వహిస్తాడు.

చెంచులు ఒకచోట స్థిరంగా ఉండరు.ఒక్కొక్క సీజన్ లో ఒక్కో చోటుకు మారతారు.ఇటువంటి సందర్భాల్లో ఒక గూడెం ఇంకొక చోటుకు మారాలంటే స్థల నిర్ణయం గూడెం పెద్ద చెప్పిన ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది.
తేదీ 20 డిసెంబరు 2017 (according to Exif data)
మూలం స్వంత కృతి
కర్త Adbh266

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

media type ఇంగ్లీష్

image/jpeg

checksum ఇంగ్లీష్

b281f5c830762b2fee6a4ec1b5de01638ad7525d

data size ఇంగ్లీష్

13,39,399 బైట్

2,441 చిణువు

2,441 చిణువు

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత15:59, 20 డిసెంబరు 201715:59, 20 డిసెంబరు 2017 నాటి కూర్పు నఖచిత్రం2,441 × 2,441 (1.28 MB)Adbh266Uploaded using Android Commons app

సార్వత్రిక ఫైలు వాడుక

ఈ దస్త్రాన్ని ఈ క్రింది ఇతర వికీలు ఉపయోగిస్తున్నాయి:

"https://te.wikipedia.org/wiki/దస్త్రం:Chenchu_tribe.jpg" నుండి వెలికితీశారు