దినేష్ చండీమల్

శ్రీలంక క్రికెటర్

దినేష్ చండీమల్ (జననం: 1989, నవంబరు 18) శ్రీలంక క్రికెటర్, శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.[1][2] 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచిన గ్రూప్ దశల్లో కొన్నిసార్లు వికెట్ కీపర్‌గా ఆడాడు.కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా శ్రీలంకకు నాయకత్వం వహించాడు. తన టెస్ట్ కెరీర్‌లో 5000కు పైగా పరుగులు సాధించాడు, అంతర్జాతీయ క్రికెట్‌లో కలిపి 10000 పరుగులు చేశాడు.

దినేష్ చండీమల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లోకుగే దినేష్ చండీమల్
పుట్టిన తేదీ (1989-11-18) 1989 నవంబరు 18 (వయసు 34)
బలపిటియ, శ్రీలంక
ఎత్తు1.78 m (5 ft 10 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
పాత్రవికెట్-కీపర్-batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 122)2011 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2023 ఏప్రిల్ 16 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 144)2010 జూన్ 1 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2022 నవంబరు 30 - Afghanistan తో
తొలి T20I (క్యాప్ 33)2010 ఏప్రిల్ 30 - న్యూజీలాండ్ తో
చివరి T20I2022 ఫిబ్రవరి 27 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–presentSri Lanka Army
2009–2019Nondescripts Cricket Club
2012Ruhuna
2012రాజస్థాన్ రాయల్స్
2017Chittagong Vikings
2020–presentColombo Stars
2022Sylhet Sunrisers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 72 157 68 141
చేసిన పరుగులు 5,116 3,854 1,062 10,389
బ్యాటింగు సగటు 43.35 31.85 19.67 48.77
100లు/50లు 13/25 4/24 0/6 28/49
అత్యుత్తమ స్కోరు 206* 111 66* 354*
క్యాచ్‌లు/స్టంపింగులు 82/10 62/8 36/6 178/24
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 20

2019 సెప్టెంబరు 26న శ్రీలంక ఆర్మీలో వాలంటీర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా చేరాడు. శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్‌కు ఆడేందుకు అర్హత సాధించాడు.[3][4] 2020 ఆగస్టులో శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్‌కు ఆడుతున్నప్పుడు, శ్రీలంకలో దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరును సారాసెన్క్ సిసి పై అజేయంగా 354 పరుగులు చేశాడు.[5]

అంతర్జాతీయ క్రికెట్ మార్చు

వెస్టిండీస్‌లో జరిగిన 2010 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. తొలి గ్రూప్ దశలో న్యూజిలాండ్, జింబాబ్వేతో శ్రీలంక గ్రూప్ గేమ్‌లలో ఆడాడు. "సూపర్ ఎయిట్" చివరి సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు.

ఫ్లోరిడాలో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో కూడా ఆడిన తర్వాత, జింబాబ్వేలో జరిగే వన్డే ట్రై-సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇతడు జింబాబ్వేపై అరంగేట్రం చేసాడు, అజేయంగా 10 పరుగులు చేశాడు. ఆపై భారత్‌పై 118 బంతుల్లో 111 పరుగులు చేయడం ద్వారా తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ శ్రీలంక జట్టు మ్యాచ్‌లో విజయం సాధించడంలో సహాయపడింది. వన్డేల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన శ్రీలంక ఆటగాడిగా కూడా నిలిచాడు.

2011 డిసెంబరులో శ్రీలంక తరఫున డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రెండో టెస్టులో అరంగేట్రం చేశాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు (58, 54) చేసాడు , టెస్ట్ అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి శ్రీలంక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికాలో శ్రీలంక తొలి టెస్టు విజయం సాధించింది.[6]

2012 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 రన్నరప్ జట్టు, 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 మొదటి గ్రూప్ దశలో శ్రీలంకకు నాయకత్వం వహించాడు. డారెన్ సమీ, అజింక్యా రహానే, పీటర్ బోరెన్, కోరీ అండర్సన్, బాబర్ హయత్‌లతో పాటు ఫీల్డర్‌గా (4) ఒకే టీ20లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఉమ్మడి రికార్డును చండీమాల్ కలిగి ఉన్నాడు. శ్రీలంక తరఫున ఒకే టీ20లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు.[7]

కెప్టెన్సీ మార్చు

2013 జూలై 17న కొలంబోలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లకు వన్డే కెప్టెన్‌గా నియమించబడినప్పుడు, శ్రీలంకకు అతి పిన్న వయస్కుడైన వన్డే కెప్టెన్ అయ్యాడు.[8] 2013లో శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్‌గా, దేశ వన్డే అంతర్జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించబడ్డాడు.

2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో ఇతను ఒకడు.[9][10]

వ్యక్తిగత జీవితం మార్చు

2015 మే 1న కొలంబోలో ఇషికా జయశేఖరతో ఇతని వివాహం జరిగింది.[11][12][13] 2020 అక్టోబరులో శ్రీలంక ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌ను అటాచ్ చేసిన శ్రీలంక ఆర్మీ వాలంటీర్ ఫోర్స్‌లో మేజర్‌గా నియమించబడ్డాడు.[14]

మూలాలు మార్చు

  1. "Chandimal to lead SL in Tests, Tharanga in shorter formats". ESPNcricinfo. Retrieved 11 July 2017.
  2. "Chandimal replaces Mathews as Sri Lanka ODI captain". International Cricket Council. Retrieved 2023-08-27.
  3. "Dinesh Chandimal to join Sri Lankan Army as commissioned officer". www.adaderana.lk. Retrieved 2023-08-27.
  4. "Dinesh Chandimal joins SL Army today - Sri Lanka Latest News". Sri Lanka News - Newsfirst (in ఇంగ్లీష్). 2019-09-26. Retrieved 2023-08-27.
  5. "Former Sri Lanka Captain Dinesh Chandimal Scores Unbeaten 354". Cricket Addictor. 27 August 2020. Retrieved 2023-08-27.
  6. "Sri Lanka tour of South Africa, 2nd Test: South Africa v Sri Lanka at Durban, Dec 26–30, 2011". ESPNcricinfo. Retrieved 2023-08-27.
  7. "Records | Twenty20 Internationals | Fielding records | Most catches in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-27.
  8. Fernando, Andrew Fidel (17 July 2013). "Chandimal becomes youngest Sri Lanka ODI captain". ESPNcricinfo. Retrieved 2023-08-27.
  9. "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-27.
  10. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-27.
  11. "දිනේෂ් චන්දිමාල් යුගදිවියට - Photos - Hiru Gossip". Retrieved 2023-08-27.
  12. "Dinesh Chandimal Wedding". Archived from the original on 2018-08-18. Retrieved 2023-08-27.
  13. "Dinesh Chandimal's Wedding Day". Archived from the original on 23 December 2015. Retrieved 2023-08-27.
  14. "Dinesh Chandimal and Thisara Perera commissioned to Army Volunteer Force". newswire.lk. Retrieved 2023-08-27.

బాహ్య లింకులు మార్చు