ది గ్రేట్ ఇండియన్ సూసైడ్

ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ 2023లో తెలుగులో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా. కే.ఎస్.వి సమర్పణలో సైరింజ్ సినిమా బ్యానర్‌పై విప్లవ్ కోనేటి స్వీయ నిర్మాణాల్లో నిర్మించి దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, పవిత్రా లోకేష్, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 3న విడుదల చేసి[1] సినిమాను అక్టోబర్ 9న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2]

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
దర్శకత్వంవిప్లవ్ కోనేటి
రచనవిప్లవ్ కోనేటి
నిర్మాతవిప్లవ్ కోనేటి
తారాగణం
ఛాయాగ్రహణంఅనంత్ నాగ్ - అజయ్ నాగ్
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంశ్రీ చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థ
సైరింజ్ సినిమా
విడుదల తేదీ
2023 అక్టోబరు 6 (2023-10-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

కథ మార్చు

హేమంత్ (రామ్‌కార్తిక్‌) ఓ అనాథ‌. త‌న స్నేహితుడితో క‌లిసి కాఫీషాప్ ర‌న్‌ చేస్తుంటాడు. చైత్ర (హేభాప‌టేల్‌) అత‌డి షాప్‌కు కుకీస్ స‌ప్లై చేస్తుంటుంది ఈ క్రమంలో అతడు చైత్ర‌ను ప్రేమించి, పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ చైత్ర మాత్రం అత‌డి ప్రేమను నిరాకరిస్తుంది. కారు ప్రమాదంలో మరణించిన బళ్లారి నీలకంఠం (నరేశ్) ను ఎలాగైనా తిరిగి బతికించాలని ఆమెతో సహా ఆమె కుటుంబ సభ్యులు ఆత్మ‌త‌ర్ప‌ణం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. దీనికి నిరాకరించిన హేమంత్‌ అమీతో పటు వారి కుటుంబాన్ని రక్షించాలని వారి ఇంట్లో అడుగుపెడతాడు. ఈ క్రమంలో అత‌డికి ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? వాటిని హేమంత్ ఎలా ఎదురుకున్నాడు? చివరకు ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[3]

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సైరింజ్ సినిమా
  • నిర్మాత: విప్లవ్ కోనేటి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి
  • సంగీతం: శ్రీ చరణ్ పాకాల
  • సినిమాటోగ్రఫీ: అనంత్ నాగ్ - అజయ్ నాగ్
  • ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
  • ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి
  • పాటలు: డాక్టర్ జహివగో

మూలాలు మార్చు

  1. Eenadu (3 October 2023). "చనిపోయిన వ్యక్తిని బతికించడానికి 8మంది ఆత్మహత్య". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  2. TV9 Telugu (6 October 2023). "వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (6 October 2023). "రివ్యూ: ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌.. చనిపోయిన వ్యక్తిని బతికించడానికి 8 మంది ఆత్మహత్య". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.