దీప్తి భట్నాగర్

భారతీయ సినీ నటి

దీప్తి భట్నాగర్ (జననం: సెప్టెంబరు 30, 1967) ఒక భారతీయ సినీ నటి, మోడల్. పెళ్ళిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన రాం శాస్త్ర అనే సినిమాలో జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలాతో పాటు నటించింది.[1]

దీప్తి భట్నాగర్
2012 లో దీప్తి భట్నాగర్
జననం (1967-09-30) 1967 సెప్టెంబరు 30 (వయసు 56)
వృత్తిమోడల్, నటి, టివి వ్యాఖ్యాత

జీవిత విశేషాలు మార్చు

భట్నాగర్ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జన్మించింది.[2][3] ప్రాథమిక విద్య ఢిల్లీలో పూర్తి చేసింది. మీరట్ విశ్వవిద్యాలయంలో చదివింది. 1992 లో మీరట్ లో ఉన్న తన హస్తకళల సంస్థను ప్రచారంలోకి తెచ్చేందుకు మంచి ప్రకటనల సంస్థను వెతుక్కుంటూ ముంబై వెళ్ళింది.

కెరీర్ మార్చు

1992 లో ముంబై వెళ్ళినపుడు రూపమాలిని అనే చీరల సంస్థ తమ ఉత్పత్తులకు మోడల్ గా ఉండమని ఒక ప్రకటన సంస్థ ఆహ్వానించింది. దాని తర్వాత ఆమెకు వరుసగా 12 అవకాశాలు వచ్చాయి.[4] దాంతో ఆమె తన హస్తకళల సంస్థను చూసుకోవడం మానేసి పూర్తి స్థాయి మోడలింగ్ వృత్తిలోకి ప్రవేశించింది. 1990 లో ఈవ్స్ వీక్లీ పోటీల్లో విజేతగా నిలిచింది. తరువాత కొద్దిరోజులకే సింగపూర్ లాంటి దేశాలలో అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రదర్శనల్లో పాల్గొన్నది.

మూలాలు మార్చు

  1. Ahuja, Asha. "A career reborn on small screen". The Tribune. Retrieved 2011-09-08.
  2. Wadhwa, Akash (17 February 2013). "I want to use my brains, not just my face: Deepti Bhatnagar". The Times of India. Retrieved 5 May 2016.
  3. "Deepti Bhatnagar". Seasons India. Archived from the original on 18 జూలై 2013. Retrieved 5 May 2016.
  4. K. Devgan (17 November 2002). "One-way yatra to success". The Sunday Tribune. Retrieved 2011-09-08.