దేవిశెట్టి కృష్ణారావు

దేవిశెట్టి కృష్ణారావు ప్రముఖ రంగస్థల నటులు.

దేవిశెట్టి కృష్ణారావు
జననంఆగష్టు 12, 1958
తెనాలి, గుంటూరు జిల్లా
ఇతర పేర్లుదేవిశెట్టి కృష్ణారావు
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు.

జననం మార్చు

ఈయన 1958 ఆగష్టు 12న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం మార్చు

చిన్నప్పటినుండి తన మేనమామలైన కన్నెగంటి నాసరయ్య, రాధగార్ల నాటకాలను చూసి పెరిగిన కృష్ణారావు నటనపై ఆసక్తిని పెంచుకొని నాటకరంగానికి వచ్చారు. తన అన్నగారైన సాయిబాబు, కృష్ణారావుకు ప్రప్రథమంగా మేకప్ వేసి నాటకాలలో ప్రోత్సహించాడు. మొదట్లో రాజీనామా నాటికలో నటించిన కృష్ణారావు, కాశీమోహన్ నేతృత్వంలో ఛైర్మన్, అడ్రస్ లేని మనుష్యులు వంటి నాటకాలలో నటించారు.

1978లో నన్నపనేని వెంకట్రావ్ స్మారకార్ధం కన్నెగంటి మధు, ఇతర మిత్రులతో జె.జె అండ్ యన్.వి.ఆర్. ఆర్టు థియేటర్ ను స్థాపించి, కుక్క నాటికను వివిధ పరిషత్తులలో ప్రదర్శించారు. పాత గుంటూరులో జరిగిన పరిషత్ లో కుక్క నాటికలోని పాలేరు పాత్రకుగానూ కృష్ణారావుకు ఉత్తమ పాత్రోచిత నటుడుగా బహుమతి లభించింది.

నటించిన నాటకాలు - నాటికలు మార్చు

  • భయం
  • చీకటి తెరలు
  • రైలు ప్రమాదం
  • రాజీనామా
  • రేపేంది
  • కన్యాశుల్కం
  • అమ్మకానికో అబ్బాయి
  • తపస్వీ
  • కృష్ణపక్షం
  • మానవుడు - చిరంజీవి
  • పద్మవ్యూహం
  • కొక్కొరొక్కో
  • క్షణం
  • ప్రశ్న
  • దొంగ గారొస్తున్నారు - స్వాగతం చెప్పండి
  • పూజా పుష్పం
  • ఈనాడు
  • పుటుక్కు జరజర డుబుక్కుమే

రచించిన నాటకాలు మార్చు

  • క్షణం
  • కర్తవ్యం

మూలాలు మార్చు

  • దేవిశెట్టి కృష్ణారావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 157.