ధూళిపాళ్ల వీరయ్య చౌదరి

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (1942-1995) "పాల వీరయ్య" గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనాదరణ పొందిన మాజీ రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పారిశ్రాభివృద్ధి, సంగం పాల డైరీ వ్యవస్థాపకుడు.[2]

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
In office
1988–1989
నియోజకవర్గంపొన్నూరు
వ్యక్తిగత వివరాలు
జననం(1942-02-19)1942 ఫిబ్రవరి 19
చింతలపూడి
మరణం1994 జనవరి 24(1994-01-24) (వయసు 72)[1]
నారాకోడూర్
రాజకీయ పార్టీతెలుగు దేశం పార్టీ
సంతానం3

జననం మార్చు

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లా నిడుబ్రోలు (పొన్నూరు) తాలూకా చింతలపూడి గ్రామంలో ధూళిపాళ్ల రత్తయ్య, తులసమ్మ దంపతులకు జన్మించాడు.[3]

కెరీర్ మార్చు

రాజకీయ జీవితం మార్చు

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రైతు బంధావుడు ఆచార్య ఎన్.జి.రంగా సిద్ధాంతాలకి ఆకర్షితుడై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1968లో చింతలపూడి గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం తరువాతి కాలంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అశేషమైన ప్రజాదరణ సొంతం చేసుకున్నారు.

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి 1983, 1985లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాడు. 1988-1989 వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.1989లో పొన్నూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టినేని వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యాడు. 1989 నుంచి 1994 వరకు గుంటూరు జిల్లాలో పార్టీని నడిపించడంలో కీలకమైన పాత్ర ఈయనది.[3]

సంగం డైరీ మార్చు

గుంటూరు జిల్లాలో తెనాలి దగ్గర సంగం జాగర్లమూడి గ్రామంలో ఉన్న సంగం డైరీని స్థాపించడానికి వీరయ్య చౌదరి కృషి చేసాడు. చింతలపూడి గ్రామ సర్పంచిగా ఉంటూనే గ్రామ పాల ఉత్పత్తి దారుల ప్రాథమిక సంఘం అధ్యక్షుడుగా వీరయ్య చౌదరి ఎన్నికయ్యాడు. ఆరోజుల్లో జిల్లా వ్యాప్తంగా పాల సేకరణ కొందరు ప్రవైట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది తరువాతి కాలంలో తెనాలి పాల ఉత్పత్తి దారుల సమాఖ్య ఏర్పాటు జరిగిన సమయంలో తెనాలి, బాపట్ల ప్రాంతాల్లో పాల సేకరణ ఈ సమాఖ్య ద్వారా నే జరిగేది, కానీ దేశవ్యాప్తంగా క్షిరా విప్లవాన్ని ఆవిష్కరణ తరువాత ప్రతి రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో సహకార పాల డైరీలను ఏర్పాటు చేయడంతో అప్పటి జిల్లా వ్యక్తులు రాష్ట్ర మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి రఘురామయ్యా లతో వీరయ్య చర్చించి వారి సహకారంతో జాతీయ పాడి పరిశ్రమ సమాఖ్య అధ్యక్షుడు, భారత దేశ క్షిర విప్లవ సారథి కురియన్ గారిని కలిసి జిల్లాలో డైరీ ఏర్పాటుకు కృషి చేశాడు. తొలుత గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సమాఖ్య ఏర్పాటు చేసి ఆపరేషన్ ఫ్లడ్ పథకం కింద వచ్చిన నిధులతో నిర్మాణం గావించాడు. 1977లో తెనాలి పక్కన సంగం జాగర్లమూడి గ్రామ కేంద్రంగా కురియన్ చేతుల మీదగా డైరీ ప్రారంభించడం జరిగింది.[4]

1977-79 వరకు డైరీ మొదటి ఛైర్మన్ గా మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు బాధ్యతలు స్వీకరించాడు, వీరయ్య చౌదరి పాలక మండలిలో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1979 లో డైరీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి డైరీని జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా విస్తరించడంలో మారువలేని కృషి చేయడమే కాకుండా డైరీని అభివృద్ధి, లాభాల బాట పట్టించాడు.

సంగం డైరీ ద్వారానే వీరయ్య చౌదరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, దేశవ్యాప్త డైరీ, రైతాంగ వర్గాలకు సూపరిచితులయ్యాడు. 1979-1985, 1992-1994 వరకు మూడు సార్లు డైరీ ఛైర్మన్ గా పనిచేశాడు.

రాష్ట్రవ్యాప్తంగా పాడి పరిశ్రమకు చేయూత నిచ్చేందుకు ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడుగా 1985-1989 వరకు బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది కోసం పాటుపడ్డాడు.

సంగం డైరీ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుంటూరు జిల్లాలో ఉన్న రైతులు ఆయన్ని " పాల వీరయ్య "గా పిలుచుకునే వారు.

వ్యక్తిగత జీవితం మార్చు

వీరయ్య చౌదరికి ముగ్గురు సంతానం ఇద్దరూ అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈయన పెద్ద కుమారుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ ఛైర్మన్.

మరణం మార్చు

1994 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుంటూరు నగరంలో తెలుగు దేశం పార్టీ తలపెట్టిన తెలుగు రైతు సమావేశం ఏర్పాటు బాధ్యతలు చూసి తన స్వగ్రామమైన చింతలపూడి గ్రామానికి వస్తున్న సమయంలో నారా కోడూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. https://www.thehindu.com/news/cities/Vijayawada/launch-of-schemes-marks-dairy-founders-death-anniversary/article33654612.ece
  2. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-12-30.
  3. 3.0 3.1 "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-12-30.
  4. "About Us". dvchospitals.com. Archived from the original on 2021-08-19. Retrieved 2020-12-30.

https://qr.ae/pGSbM0.

.