ధ్యాన బుద్ధ విగ్రహం

ధ్యాన బుద్ధ విగ్రహం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి లో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం.[1] ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇది కృష్ణా నది ఒడ్డున నాలుగన్నర ఎకరాల స్థలంలో ఇది నెలకొల్పబడింది. సా.పూ 200 నుంచి సా. శ 200 మధ్యలో ఈ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కళాఖండాలు ఏర్పాటు చేశారు.

ధ్యాన బుద్ధ
ప్రదేశంఅమరావతి, పల్నాడు జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు16°34′44″N 80°21′11″E / 16.5789°N 80.3531°E / 16.5789; 80.3531
ఎత్తు125 feet (38 m)
పూర్తయింది2015
పరిపాలన సంస్థఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ
వాడిన వస్తువులుకాంక్రీటు, రాయి
ధ్యాన బుద్ధ విగ్రహం is located in Andhra Pradesh
ధ్యాన బుద్ధ విగ్రహం
Location in Andhra Pradesh, India

చరిత్ర మార్చు

అమరావతి, దాని సమీపంలోని ధరణికోట గురించిన లిఖిత చరిత్ర సా.పూ 5వ శతాబ్దం నాటిది. సా.శ.పూ 3వ శతాబ్దం నుంచి సా.శ 3 వ శతాబ్దం దాకా ఈ ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల రాజధాని ఇది. వీరు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. అమరావతిలో ముఖ్యమైన చారిత్రక స్థలం అక్కడున్న మహాచైత్యం. దీన్ని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ పర్యవేక్షిస్తూ అక్కడే ఒక సంగ్రహాలయాన్ని కూడా నడుపుతుంది.

నిర్మాణం, ప్రాముఖ్యత మార్చు

ఈ విగ్రహ నిర్మాణం 2003 లో ప్రారంభించి 2015లో పూర్తి చేశారు.[2] మోక్షాన్ని సాధించడానికి బుద్ధుని అష్టాంగమార్గం ప్రతీకగా ఈ విగ్రహం ఎనిమిది స్తంభాలపై భారీ కమలం అకారంలోని పునాదిపై వుంది.ఈ ప్రాంతం నాలుగు విభాగాలను కలిగివుంది. ఇవి నాలుగు ఉదాత్త సత్యాలకు ప్రతీకలు. [3]ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బౌద్ధ సిద్ధాంతాల నేపథ్యంతో నిర్మించిన ఉద్యానవనాన్ని పూర్తి చేసి 2018లో ప్రజల సందర్శనకు అనుమతించనుంది.[4]

ఈ విగ్రహం అడుగున గల మూడు అంతస్తుల ప్రదర్శనశాలలో బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే అమరావతి కళ యొక్క శిల్పాలు ఉన్నాయి. భారతదేశం, ప్రపంచంలోని ప్రదర్శనశాలలలోగల అమరావతి మహాచైత్య స్థూపం శిలాఫలకాల ఆధునిక నకళ్ళు ఇక్కడ వున్నాయి.

చిత్రాలు మార్చు


మూలాలు మార్చు

  1. "Dhyana Buddha project: a lone man's crusade". The Hindu (in Indian English). 2011-11-13. ISSN 0971-751X. Retrieved 2019-06-02.
  2. "Tallest Dhyana Buddha to be ready in Amaravati". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2014-09-15. Retrieved 2019-06-02.
  3. Samuel, P. Jonathan (22 October 2015). "Dhyana Buddha to be the cynosure". The Hindu. Retrieved 17 March 2016.
  4. "Tallest Buddha statue to be unveiled in Guntur soon". The Times of India (in ఇంగ్లీష్). March 25, 2011. Retrieved 2019-06-02.