నముడూరు అప్పలనరసింహం

నముడూరు అప్పల నరసింహం (1917 - 1986) ప్రముఖ తెలుగు కవి, పండితుడు, అష్టావధాని.

వీరు 1917 జూన్ 16 తేదీన విశాఖపట్నంలో జన్మించారు. వీరు పాఠశాల ఉపాధ్యాయునిగా 27 సంవత్సరాలు పనిచేసి, 1972లో పదవీ విరమణ చేశారు. అనంతరం అన్నపూర్ణ ట్యుటోరియల్స్ లో తెలుగు పండితులుగా పనిచేశారు.

రచనలు మార్చు

వీరు సుమారు 300కు పైగా రచనలు చేయగా; అందులో 64 మాత్రమే ముద్రించబడినాయి. వీనిలో కబోది అనే కావ్యం మంచి పేరుతెచ్చిపెట్టింది.

  • బికారి
  • కబోది
  • గురుమూర్తి
  • శ్రీమత్ సుందర రామాయణం శతకాలు
  • శ్రీ కాశీవిశ్వనాథ ప్రభు
  • ఆదిత్య హృదయం
  • దేవి
  • అంతా ఒకటే (నాటకం)
  • పాలవెల్లి (ఆంగ్ల కవుల పద్యాల అనువాదం)

కబోది మార్చు

ఈ రచన కావ్య రచన చేయువారికి వ్యాయామం కలిగించింది. ఇది శివ పార్వతుల మధ్య జరిగిన సంభాషణ, సంభావనలు గలది. చాలా లోక రీతులను, శాస్త్ర మర్యాదలను ఇందులో చెప్పించారు. ఇందులో 592 పద్యాలున్నాయి. ఈ కావ్యంలోని మరొక విశేషం: మొదటి పద్యం 'ఆ అక్షరంతో ప్రారంభమై హల్లుల చివరకు వచ్చి అక్కడ నుండి గుణింతాలతో కదిలి అక్కడితో ఆగక సంయుక్తాక్షరపు గుణింతాలతో సాగి చివరి వరకు అక్షర సమామ్నాయం అంతా పద్యాదులతో నింపబడినది. ఇది చాలా కష్టమైన ప్రక్తియ అని పండితులచే కొనియాడబడింది.

వీరు 1986లో విశాఖపట్నంలో పరమపదించారు.