నవ తెలంగాణ ప్రజా పార్టీ

రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడైన దేవేందర్ గౌడ్ 2008, జూలై 11న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై స్థాపింఛిన పార్టీ నవ తెలంగాణ పార్టీ. తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వాదానికి తగిన మద్దతు లభించలేదని జూన్ 23నఆ పార్టీకి రాజీనామా చేసిన 18 రోజుల అనంతరం ప్రత్యేక పార్టీ ఏర్పాటుచేశాడు. ఇదే సందర్భంలో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.[1]

నవ తెలంగాణ ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు దేవేందర్ గౌడ్ చిత్రం

పార్టీ జెండా మార్చు

తెలంగాణ ప్రజల ఆశలు, నమ్మకాలకు, అన్ని వర్గాల ప్రతీకగా జెండాను రూపొందినట్లు పార్టీ అధినేత దేవేందర్ ప్రకటించాడు. చుట్టూ నీలిరంగు, మధ్యలో పాలపిట్ట రంగులో తెలంగాణ పటం, అందులో కాగడ, పుస్తకం, నాగలి, పారలను ఉంచారు.[2]

ప్రజారాజ్యం పార్టీ లో విలీనం మార్చు

ప్రముఖ సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపింఛిన తరువాత దేవేందర్ గౌడ్ నవతెలంగాణ పార్టీ ని ప్రజారాజ్యం పార్టీ లో వినలీనం ఛేశాడు.

తిరిగి తెలుగుదేశంలో చేరిక మార్చు

ప్రజారాజ్యం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న దేవేందర్ గౌడ్ 2009 ఎన్నికల్లో తను పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం, ప్రజారాజ్యం పార్టీని ప్రజలు అంతగా ఆదరించకపోవడం ఛూసి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు.

మూలాలు మార్చు

  1. "దేవేందర్ పార్టీ పేరు... 'నవ తెలంగాణ ప్పార్టీ' (వెబ్ దునియా)". Archived from the original on 2016-03-05. Retrieved 2008-07-13.
  2. ఈనాడు దినపత్రిక, తేది జూలై 12, 2008, పేజీ 2