నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న ఎయిర్‌ఫీల్డ్.

నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న ఎయిర్‌ఫీల్డ్. నాగార్జున సాగర్ హైవేపై 12 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్ లో పైలట్లకు శిక్షణ ఇస్తుంటారు.[1]

నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా
యజమానిభారత ప్రభుత్వం
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం R-148 HHY VOR at 12 nm
ఎత్తు AMSL551.9 m / 1,811 ft
అక్షాంశరేఖాంశాలు17°18′21″N 078°33′38″E / 17.30583°N 78.56056°E / 17.30583; 78.56056
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
14/32 914 3,000 ?

వివరాలు మార్చు

తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ మొదలైనవి తమతమ పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తాయి.[2] ఫ్లైటెక్ ఏవియేషన్‌కు నాదిర్‌గుల్‌లో సొంత హ్యాంగర్ ఉంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో 14/32 రన్‌వే మాత్రమే ఉంది. ట్రైనీలు ఎక్కువగా సెస్నా 152, సెస్నా 172 వంటి సింగిల్ ఇంజన్ గల విమానాలను నడుపుతారు. సర్క్యూట్ ఎత్తు 2600'. అలాగే, ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రత్యేకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదు.

ప్రస్తుతం మార్చు

శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన తర్వాత, పైలట్ల శిక్షణ కార్యకలాపాలన్నింటినీ బేగంపేట విమానాశ్రయానికి మార్చబడ్డాయి. అయినప్పటికీ, ఇక్కడ కూడా అప్పుడప్పుడు శిక్షణ ఇస్తుంటారు.[3]

మూలాలు మార్చు

  1. "Nadirgul Airfield". www.aai.aero. Retrieved 2022-01-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. India, The Hans (2017-08-30). "NCC revives flying training of Air Wing Cadets at Warangal". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-28.
  3. "India spent Rs 36 crore in 2018-19 on 27 airports where not a single flight takes off". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-09. Retrieved 2022-01-28.

బయటి లింకులు మార్చు

  Media related to నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్ at Wikimedia Commons