ఆరు వేదాంగాలలో నిరుక్తము ఒకటి. వేదంలోని సంస్కృత పదాలకు అర్ధం తెలియచేస్తుంది.

దీనికి కర్త యాస్కుడు. ఇందులో వేద మంత్రాలకు ఉపయోగం తెలియజేయడానికొఱకు, అంతగా ప్రసిద్ధము కాని పదాల అర్ధాలు బోధింపబడినాయి. వేదశబ్దవివరణ నిఘంటువు, శాకపూర్ణి నిరుక్తము అనేవి కూడా ఉన్నాయి.


నిరుక్తంలో "పదకాండ", "అర్ధకాండ" అనే రెండు భాగాలున్నాయి.