నూనెలను పరీక్షించడం

వంటనూనెలలో వుపయోగించు ఖాద్య తైలాలు, పారిశ్రామిక వినియోగానికై వాడు నూనెలను (పంట) మొక్కలనుండి లభించు నూనెగింజలనుండియు కొన్నిరకాల చెట్లగింజలనుండి (వేప, కానుగ, సాల్, ఇప్ప వంటివి) ఉత్పత్తిచేయుదురు.వంటనూనెలుగా ఉపయోగించు నూనెలకు ఉండవలసిన కొన్ని భౌతిక రసాయనిక లక్షణాలు, ధర్మాలను నిర్ధేశించడం జరిగింది.భారతదేశంలో బ్యూరొ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS గతంలో ISI) నూనెలకై కొన్ని ప్రమాణాలను (Standards) నిర్ణయించింది.ప్రభ్యుత్వ ఆధీనంలోని ఆహర మంత్రిత్వశాఖలోని కొన్ని శాఖలు నూనెలపై పరివేక్షణ, నియంత్రణ అధికారాలను కలిగి ఉన్నాయి.BIS వారు నూనెలను పరీక్షించుటకై పరీక్ష విధాలను కూడా పుస్తకరూపంలో ప్రకటించారు. అమెరికాలో మరికొన్నిదేశాలలో AOCS (American oil chemists society) వారు రూపొందించిన ప్రకారం నూనెలను పరీక్షించెదరు.అలాగే అన్ని దేశాలలోను నూనెలను పరీక్షించు పద్ధతులను రూపొందించారు.అయితే ప్రాథమికంగా ఎవోఒకటొ, రెండో మార్పులు తప్ప అన్ని నూనెలపరీక్షించు పద్ధతులన్ని ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి.

ముడి వంటనూనెలను (crude edible oils) ఉత్పత్తి చేయు పరిశ్రమలు, ముడి వంటనూనెలను కొనుగోలుచేసి రిపైండ్‍నూనెలను ఉత్పత్తి చేయు పరిశ్రమలవారు, తవుడు, సోయా, సాల్‍సీడ్, ఆయిల్ కేకులనుండి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ పద్ధతిలో నూనెలను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమలన్నియు స్వంత నాణ్యత నియంత్రణ ప్రయోగశాల (Quality control laboratory) లను కలిగివుండి, తాము ఉత్పత్తిచేయు, కొనుగోలు చేయు నూనెలను ఈ లాబొరెటరిలలో పరీక్షించెదరు. ఒకవేళ కొనుగోలుదారునికి, అమ్మకదారునికి విభేదాలొచ్చిన ప్రవేట్ లాబ్ లలోలేదా ప్రభుత్వ అనుభంద ప్రయోగశాలలో పరీక్షలుచేయించెదరు.

నూనెల నాణ్యత,ధర్మాలను నిర్ణయించుటకు చేయు పరీక్షలు మార్చు

ముఖ్యంగా ఈ దిగువ పెర్కొన్న పరీక్షలను అధికంగా చేయుదురు.

1.నూనెలోనితేమశాతం

2.నూనెలోని కరుగని మలినాలశాతం

3.నూనెలోని ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం

4.నూనె విశిష్ణ గురుత్వం

5.నూనె ద్రవీభవన స్ధానం

6.నూనె లోని అన్ సపొనిఫియబుల్ మాటరు

7.నూనెలో సపొనిఫికేసను విలువ

8.నూనెలో ఐయోడిన్ విలువ

9.నూనె రంగు

10.నూనెలోని వ్యాక్సు శాతం

11.నూనెలోని గమ్స్ శాతం

12.నూనె యొక్క పెరాక్సైడ్ విలువ

13.నూనె వక్రీభవ గుణకం (Refractive Index)

పైన పెర్కొన్న పరీక్షలే కాకుండగా నూనెలలో కల్తిని గుర్తించుటకై స్వఛ్ఛత (purity) నిర్ధారణ పరీక్షలు కూడా ఉన్నాయి.