నేతకాని వెంకటేష్

బోర్లకుంట వెంకటేష్ నేతకాని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ సభ్యుడు.[1]

నేతకాని వెంకటేష్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
  2019- ప్రస్తుతం
ముందు బాల్క సుమన్
నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబర్ 21, 1964
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం పెద్దపల్లి, తెలంగాణ

రాజకీయ విశేషాలు మార్చు

2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పై 95,180 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[2] ఈయన రాజకీయాలలో చేరకముందు ఎక్సైజ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహించేవాడు.[1] ఈయన 1994, 1999, 2009 లలో మూడు సార్లు బోథన్ నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలుపొందాడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 https://telanganatoday.com/all-you-need-to-know-about-trs-lok-sabha-candidates/amp
  2. https://www.thehindu.com/news/national/telangana/new-entrants-to-try-their-luck-from-peddapalli/article26680701.ece/amp/
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-23. Retrieved 2020-07-10.