నేహా జుల్కా తెలుగు, హిందీ సినిమా నటి, ప్రచారకర్త.[1] ఒక్కడున్నాడు చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

నేహా జుల్కా
జననం
వృత్తినటి

జననం - విద్యాభ్యాసం మార్చు

నేహా జుల్కా, ముంబై లో జన్మించింది. ఎంబిఏ వరకు చదువుకుంది.

వృత్తిజీవితం మార్చు

నేహా జుల్కా ప్రచారకర్తగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించి, సుమారు 70 వరకూ వ్యాపార ప్రకటనలలో నటించింది. 2006 లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియాగా ఎన్నికయింది.[1]

2007లో తొట్టెంపూడి గోపీచంద్ హీరోగా నటించిన, ఒక్కడున్నాడు తెలుగు చిత్రంద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన నేహా, ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన వియ్యాలవారి కయ్యాలు సినిమాలో నటించింది. హిందీ చిత్రరంగంలోకి కూడా ప్రవేశిచింది.[1]

నటించినవి మార్చు

చిత్రాలు మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్ర పేరు భాష
2007 ఒక్కడున్నాడు గౌతమి తెలుగు
వియ్యాలవారి కయ్యాలు[2] నందిని
కైసే కహేన్ రాధిక హిందీ

టెలివిజన్ కార్యక్రమాలు మార్చు

  • దిల్ మిల్ గయ్యే (డా. నైనా)
  • గీత్ - హుయ్ సబ్సే పరాయ్ (పరి)

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "నేహా జుల్కా,Nehajulka". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 3 June 2017.[permanent dead link]
  2. తెలుగు వెబ్ దునియా. "ఫ్యాక్షన్ గొడవలతో.. "వియ్యాల వారి కయ్యాలు"". telugu.webdunia.com. Retrieved 3 June 2017.[permanent dead link]