పంచమి (రంగనాథ రామాయణాదిక వ్యాసములు)

కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 లో జరిగింది. భారత అర్థశాస్త్రం కవిత్వతత్త్వవిచారం, ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి, లఘుపీఠికా సముచ్చయం, వ్యాసమంజరి, పంచమి, వేమన మొదలయినవి తెలుగులో ఆయన రచనలు. డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు పేరుతో 1983 లో సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోను ఆయన చేయితిరిగిన రచయితే. డ్రామా ఇన్‌ద ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌, స్పీచస్‌ ఆన్‌ యూనివర్శిటీ రిఫార్మ్‌, డెమోక్రసీ ఇన్‌ కాంటెపరరీ ఇండియా.. ఆంగ్లంలో ఆయన రచనల్లో కొన్ని. విమర్శలో విప్లవము తెచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నాడు. ఇది ఆయన రచించిన సాహిత్య విమర్శ.

దీనిని 1954 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రచురించింది.

ఇందులోని వ్యాసములు మార్చు

  • ప్రాచీనములు - వికృతులు
  • ద్రౌపదియెడ బాండవులు జూపిన గౌరవాదరములు
  • ద్రౌపది తన్ను గురించి చెప్పుకున్న ప్రకారము
  • కుంతికి ద్రౌపదియందుండెడి ప్రేమ గౌరవములు
  • అవాల్మీకములు - కంబడు
  • అవాల్మీకములు - గోనబుద్ధుడు
  • భాసుడు

మూలాలు మార్చు