పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం

పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలోని ఇందుక్కి జిల్లాలోని దేవికులం అనే ప్రాంతంలో ఉంది.[1]

పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Wildlife sign at observation tower
ప్రదేశందేవికులం, ఇందుక్కి జిల్లా, కేరళ, భారతదేశం
సమీప నగరంమరయూర్
విస్తీర్ణం1.32 km2 (0.51 sq mi)
Elevation:
1,886 meters (6,188 ft) to 2,531 meters (8,304 ft)
స్థాపితం2003
పాలకమండలిKerala State Forest and Wild Life Department

చరిత్ర మార్చు

ఈ ఉద్యానవనాన్ని 2003 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఇది 1.32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనాన్ని పంపడుం షోలా అనే నామకరణానికి గల కారణం మలయాళ భాష లో పాంప్ అనగా పాము అని, ఆటం అనగా నృత్యం అని, చోలై అంటే అడవి అని అర్థం నుంచి తీసుకున్నారు.

జంతు, వృక్ష సంపద మార్చు

ఈ ఉద్యావనంలో వివిధ రకాల ఔషధ మొక్కలు, యూకలిప్తస్ మొక్కలు ఉన్నాయి.[2] ఇందులో అంతరించిపోతున్న నీలగిరి మార్టెన్ అనే జంతువులు సంరక్షణలో ఉన్నాయి. ఇందులో చిరుతపులులు, సింహాలు, ఏనుగులు, అడవి పందులు లాంటి ఎన్నో రకాల జంతువులు సంరక్షణలో ఉన్నాయి.[3]

మరిన్ని విశేషాలు మార్చు

ఈ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలో కెల్లా అతిచిన్న జాతీయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనం పళని హిల్స్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, అల్లినగరం రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రక్కనే ఉంది.[4]

మూలాలు మార్చు

  1. Envis Kerala (2009). "Forest". Kerala State Council for Science, Technology and Environment. Archived from the original on 2008-03-11. Retrieved 2019-10-05.
  2. "Pampadum Shola National Park" (PDF). 19 Maharani Chinnamba Road Alwarpet, Chennai - 600018: Ficus Wildlife & Natural History Tours. 2009. Retrieved 2019-10-05.{{cite web}}: CS1 maint: location (link)[permanent dead link]
  3. Mathew Roy, Kerala, Small National Parks
  4. Online Highways LLC. (2004) India | Kerala | Devikulam Pambadum Shola National Park, retrieved 5/10/2019 [1]