పల్లగిరి

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా గ్రామం

పల్లగిరి ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగామ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 460 ఇళ్లతో, 1778 జనాభాతో 537 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 904, ఆడవారి సంఖ్య 874. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 726 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588885. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[1][2]

పల్లగిరి
—  రెవెన్యూ గ్రామం  —
పల్లగిరి is located in Andhra Pradesh
పల్లగిరి
పల్లగిరి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°46′51″N 80°19′24″E / 16.780880°N 80.323400°E / 16.780880; 80.323400
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం నందిగామ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,778
 - పురుషులు 904
 - స్త్రీలు 874
 - గృహాల సంఖ్య 460
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్ 08678

సమీప గ్రామాలు మార్చు

ఈ గ్రామానికి సమీపంలో మగలు, రుద్రవరం, గొల్లమూడి, అంబరుపేట, చిననందిగామ గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు నందిగామలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నందిగామలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నందిగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

పల్లగిరిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 47 కి.మీ దూరంలో ఉంది.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వేల్పుల బిక్షాలు, సర్పంచిగా ఎన్నికైనారు. నూతనంగా పంచాయతీ పాలకవర్గం ఏర్పడగానే, తొలి సమావేశంలోనే అంతర్గత రహదారులను గ్రావెల్ తో అభివృద్ధి చేయాలని తీర్మానించి, ఒక లక్ష రూపాయలతో మరమ్మత్తులు చేయించారు. రు. 40 లక్షలతో మరియొక పది సిమెంటు రహదారుల నిర్మాణం చేపట్టినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ అలివేలుమంగా పద్మావతీ సమేత శ్రీ వేoకటేశ్వరస్వామివారి ఆలయం మార్చు

మునేరు నది ఒడ్డున పల్లగిరికొండపై వెలసిన ఈ ఆలయంలో 2014,నవంబరు-2, కార్తీకమాసం, ఆదివారం, దశమి నాడు 108 మంది దంపతులు పీటలపై కూర్చుని సామూహిక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వ్రతాలు నిర్వహించారు. వేదపండితులు అభిషేకాలు నిర్వహించారు. నవగ్రహోమం చేసారు. ఈ సందర్భంగా పురోహితులు శ్రీ వెంకటేశ్వరస్వామివారి వ్రతకల్పాన్ని భక్తులకు వివరించారు. కార్తీకమాసం కావడంతో మహిళలు దీపాలు వెలిగించారు. గోవిందనామాలతో పల్లగిరికొండ పులకించింది. దేవాలయ ప్రాంగణంలో ఉన్న వేప, రావిచెట్టు వద్ద నాగప్రతిష్ఠ గావించుటకు నిర్ణయించారు.

శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం మార్చు

మునేరు నదీతీరాన పల్లగిరి కొండపై ఉన్న ఈ అలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2015,మే నెలరెండవ తేదీ శనివారం నాడు ప్రారంభమైనవి. 3వ తేదీ ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు, స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. 4వ తేదీ వైశాఖపౌర్ణమి, సోమవారంనాడు, వసంతసేవ, పూర్ణాహుతి అనంతరం శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణస్వామివారి వ్రతం నిర్వహించెదరు.

శ్రీ అభయ వీరాంజనేయస్వామివారి ఆలయం మార్చు

  1. ఆలయం మునేరు నదీతీరాన పల్లగిరి కొండపై ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు.
  2. గోశాల:- ఈ ఆలయ సన్నిధిలో ఈ గోశాలను, 3 సంవత్సరాలక్రితం, రు. 15 లక్షలతో ఏర్పాటుచేసి, 40 ఆవులను సంరక్షించుచున్నారు.

త్రిశక్తి మందిరం మార్చు

ప్రశాంత మునేరు నదీతీరాన, నందిగామ-మధిర రహదారిలో పల్లగిరికొండపై, ఈ ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. ఈ ఆలయంలో జగన్మాత దుర్గమ్మ, చదువులతల్లి సరస్వతీదేవి, శ్రీ కనకమహాలక్ష్మి దేవతలను ఒకే ఆలయంలో ప్రతిష్ఠించారు. పురాతన దుర్గమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా భక్తులు ఒక కమిటీగా ఏర్పడి, 50 లక్షల రూపాయల వ్యయంతో, ఆలయాన్ని అపురూపంగా పునర్నిర్మించారు. ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించారు. 29వతేదీనాడు అంకురార్పణ, 29,30 తేదీలలో హోమాలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, ఉదయం 8-18 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, భక్తుల జయజయధ్వానాలతో, రెండుధ్వజస్థంబాలను ప్రతిష్ఠించారు. యంత్ర ప్రతిష్ఠలు, శిఖర ప్రతిష్ఠలు, వినాయకుని విగ్రహ ప్రతిష్ఠలు, ఏకకాలంలో నిర్వహించారు. కళాన్యాసం, మహూపూర్ణాహుతి, ఆచార్యపూజ, గోపూజ చేసారు. దేవాలయ శిఖరాలపై పూర్ణాలు పోయగా, భక్తులు వాటికొరకు ఎగబడినారు. దేవాలయంలో విగ్రహాలకు తొలుత గోమాత దర్శనం కలిగించారు. కుంభం పోసినారు. 12మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. ఈ కార్యక్రమాలకు పరిసరప్రాంతాలనుండి వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడినది. అనంతరం పన్నెండు ఐదువేలమందికి అన్నదానం నిర్వహించారు. ఈ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లగలదని విశ్వసించుచున్నారు.త్రిశక్తి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాలు, 2017,జూన్-7వతేదీ బుధవారం నుండి 9వతేదీ శుక్రవారం వరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించెదరు.

శ్రీ లలితాదేవీ సమేత శ్రీ కోటిలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం) మార్చు

ఈ ఆలయానికి 115 సంవత్సరాల చరిత్ర ఉంది. నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం 2017,జూన్-10వతేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. 14వతేదీ బుధవారంనాడు యంత్రప్రతిష్ఠలు, శ్రీ లలితా సమేత శ్రీ కోటేశ్వరస్వామి, గణపతి, నందీశ్వర, చండీశ్వర, ధ్వజ, ద్వారపాలక, శిఖర, బలిపీఠం, నవగ్రహాలు, కాలభైరవ, సుబ్రహ్మణ్యేశ్వర, నాగబంధ విగ్రహాల ప్రతిష్ఠలు వైభవంగా నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఈ ఆలయం పునఃప్రతిష్ఠించి 16 రోజులైన సందర్భంగా, 2017,జూన్-29వ తేదీ గురువారంనాడు, ఆలయంలోని స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేసారు. దాతలు స్వామివారికి నాగాభరణం, అమ్మవారికి కళ్ళు, పోగులు, చెవులు, కిరీటం, మకర తోరణం, ఒక పాత్ర సమర్పించారు.

శ్రీ భవానీశంకరుల ఆలయం మార్చు

మునేరు నదీతీరాన పల్లగిరికొండపై వేంచేసియున్న ఈ ఆలయ వాయుప్రతిష్ఠ ఉత్సవాలు, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు శాస్త్రోక్తంగా ప్రారంభమైనవి. ఈ ఆలయంలో 2017,జూన్-5వతేదీ సోమవారంనాడు, మహాగణపతి, భవానీశంకరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నందీశ్వరుడు మొదలగు విగ్రహాలను ప్రతిష్ఠించెదరు.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

పల్లగిరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 31 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 25 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 6 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 2 హెక్టార్లు
  • బంజరు భూమి: 6 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 460 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 448 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 21 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

పల్లగిరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 21 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

పల్లగిరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

మిరప, ప్రత్తి, వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

సయ్యద్ అక్బర్ సలీం:- నందిగామ కె.వి.ఆర్.కళాశాలలో ఆఖరి సంవత్సరం బి.ఎస్.సి. చదువుచున్న ఈయన, పవర్ లిఫ్టింగ్ పోటీలలో రాణించుచున్నారు. విశ్వవిద్యాలయం స్థాయిలో రెండు, నందిగామ, జగ్గయ్యపేటలలో నిర్వహించిన జిల్లాస్థాయిలో 2 బంగారు పతకాలు సాధించారు. అనకాపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో 120 కె.జి.ల విభాగంలో పాల్గొని, 435 కె.జి.ల బరువునెత్తి బంగారు పతకం సాధించడమేగాక, 2015,సెప్టెంబరు-3వ తేదీనాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో నిర్వహించు జాతీయస్థాయి పవర్ పిఫ్టింగ్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారు.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1673. ఇందులో పురుషుల సంఖ్య 872, స్త్రీల సంఖ్య 801, గ్రామంలో నివాస గృహాలు 391 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 537 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పల్లగిరి&oldid=4114974" నుండి వెలికితీశారు