పాశుపతాస్త్రం లేదా కిరాతర్జునీయం 1939లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖపట్నంలోని ఆంధ్ర సినీటోన్‌ స్టూడియోలో తీశారు. ఈ స్టూడియోలో నిర్మించబడిన రెండవ, చివరి చిత్రం పాశుపతాస్త్రం. ఈ సినిమాను కొచ్చర్లకోట రంగారావు డైరెక్టు చేశారు. అయితే, స్టూడియో భాగస్వాముల్లో తేడాలు వచ్చి పాశుపతాస్త్రం షూటింగ్‌ చివరిదశలో ఉండగా, లైట్లు వగైరా తన భాగంగా ఇచ్చిన భాగస్వామి షూటింగ్‌ జరుగుతూ ఉండగానే, మనుషుల్ని పంపించి లైట్లు తీసుకెళ్లిపోయాట్ట! లైట్లతోపాటు అతనికి సంబంధించిన ఇతర పరికరాలూ లాక్కున్నాట్ట! అంతే! ఎలాగో సినిమా పూర్తయింది కానీ స్టూడియో మాత్రం మూతపడిపోయింది.[1]

పాశుపతాస్త్రం
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం కొచ్చర్లకోట రంగారావు
తారాగణం కళ్యాణం రఘురామయ్య,
పి.సూరిబాబు,
నిడుముక్కల,
వై.వి.రావు
సంగీతం వి.జె.గోపాల్ సింగ్
గీతరచన వజ్ఝల కాళిదాసు
భాష తెలుగు

పాటలు మార్చు

  1. ఆదిపురుష నారాయణ సదానంద సత్యరూప - పి.సూరిబాబు
  2. . గంగాధరా శంకరా పార్వతీశ శంకరా - పి. సూరిబాబు
  3. సాధుజనలోల గోపాల చకతి విజ్ఞాన - పి.సూరిబాబు
  4. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో - పి.సూరిబాబు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు