పి.ఇంద్రారెడ్డి

పటోళ్ల ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చేవెళ్ళ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.

పటోళ్ల ఇంద్రారెడ్డి

విద్యాశాఖ మంత్రి [1]
పదవీ కాలం
1985 – 1989

రాష్ట్ర హోమ్ శాఖ
పదవీ కాలం
1994 – 1995
తరువాత సబితా ఇంద్రారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 – 2000
నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గం[2]

వ్యక్తిగత వివరాలు

జననం (1954-10-04)1954 అక్టోబరు 4 [3]
కౌకుంట్ల గ్రామం, చేవెళ్ళ మండలం, రంగారెడ్డి జిల్లా, భారతదేశం
మరణం 2000 ఏప్రిల్ 22(2000-04-22) (వయసు 45)[4]
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి సబితా ఇంద్రారెడ్డి
సంతానం ముగ్గురు కుమారులు

జననం, విద్యాభాస్యం మార్చు

పి.ఇంద్రారెడ్డి 1954 అక్టోబరు 4న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ మండలం, కౌకుంట్ల గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. పి.ఇంద్రారెడ్డి లా కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు జైలు జీవితం గడిపాడు.

రాజకీయ జీవితం మార్చు

పి.ఇంద్రారెడ్డి కౌకుంట్ల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌దళ్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత 1985లో టీడీపీలో చేరి చేవెళ్ళ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో విద్యా, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన తరువాత 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రిగా పనిచేశాడు.

పి.ఇంద్రారెడ్డి 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో జరిగిన సంక్షోభం సమయంలో, ఎన్టీ రామారావు పక్షాన నిలిచాడు. ఆయన ఎన్టీఆర్ మరణానంతరం 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి లక్ష్మి పార్వతితో విభేదించి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. పి.ఇంద్రారెడ్డి 1999 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి నాల్గొవ సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మరణం మార్చు

పి.ఇంద్రారెడ్డి 2000 ఏప్రిల్ 22న ఓ వివాహానికి హాజరై తిరిగి శంషాబాద్ సమీపంలోని పాల్మకూరు గ్రామం వద్ద జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh Year Book". 1989. Retrieved 2018-06-11.
  2. "State Elections 2004 - Partywise Comparison for 204-Chevella Constituency of ANDHRA PRADESH". Eci.nic.in. Retrieved 2018-06-11.
  3. Namasthe Telangana (4 October 2021). "ఘ‌నంగా ఇంద్రారెడ్డి జయంతి వేడుక‌లు". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  4. "Former AP minister dies in accident". rediff.com. Retrieved 2018-06-11.