పీటర్ ట్రస్కాట్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

పీటర్ బెన్నెట్స్ ట్రస్కాట్ (జననం 1941, ఆగస్టు 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున పాకిస్తాన్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు.[1]

పీటర్ ట్రస్కాట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పీటర్ బెన్నెట్స్ ట్రస్కాట్
పుట్టిన తేదీ (1941-08-14) 1941 ఆగస్టు 14 (వయసు 82)
పహియాటువా, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 105)1965 12 February - Pakistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961–62Canterbury
1964–65 to 1965–66Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 18
చేసిన పరుగులు 29 904
బ్యాటింగు సగటు 14.50 25.82
100లు/50లు 0/0 1/4
అత్యధిక స్కోరు 26 165
వేసిన బంతులు 0 204
వికెట్లు 2
బౌలింగు సగటు 48.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/60
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 10/–
మూలం: Cricinfo, 1 April 2017

క్రికెట్ కెరీర్ మార్చు

ట్రస్కాట్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. క్లుప్తంగా ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను కలిగి ఉన్నాడు, కేవలం ఐదు సంవత్సరాలపాటు కొనసాగాడు. 1961–62లో కాంటర్‌బరీ తరపున మూడు మ్యాచ్‌లు ఆడాడు. తర్వాత రెండు సీజన్‌లలో న్యూజీలాండ్ అండర్-23 జట్టు తరపున ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. 1963-64లో, ఆక్లాండ్‌పై అండర్-23ల తరపున బ్యాటింగ్ ప్రారంభించి 165 పరుగులు చేశాడు.[2] ఇది ఇతని ఏకైక ఫస్ట్-క్లాస్ సెంచరీగా నిలిచిపోయింది.

కెరీర్‌లో "న్యూజీలాండ్ క్రికెట్‌లో అత్యంత సొగసైన, శక్తివంతమైన స్ట్రోక్-మేకర్లలో ఒకడు"గా వర్ణించబడ్డాడు. ట్రస్కాట్ వెల్లింగ్టన్ కోసం 1964–65, 1965–66లో క్రమం తప్పకుండా ఆడాడు. 1965 ఫిబ్రవరిలో ఒటాగోపై మూడో స్థానంలో 45 పరుగులు, 50 పరుగులు చేశాడు . బ్రూస్ ముర్రేతో 84 పరుగులు, 98 పరుగులతో రెండో వికెట్ భాగస్వామ్యాల్లో పాల్గొన్నాడు.[3] కొన్నిరోజుల తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టుకు ఎంపికయ్యాడు, 3 పరుగులు, 26 పరుగులు చేశాడు.[4][5][6] 1965లో భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లలో పర్యటించే న్యూజీలాండ్ జట్టుకు ఎంపిక కాలేదు. 1965-66లో టూరింగ్ ఎంసిసికి వ్యతిరేకంగా న్యూజీలాండ్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్ XI కోసం ఆడాడు.[7] కానీ సీజన్ ముగిసిన తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడలేదు.

మూలాలు మార్చు

  1. "Peter Truscott". CricketArchive. Retrieved 17 July 2022.
  2. "Auckland v New Zealand Under-23s 1963-64". CricketArchive. Retrieved 9 March 2018.
  3. "Otago v Wellington 1964-65". CricketArchive. Retrieved 9 March 2018.
  4. Wisden 1966, pp. 843-44.
  5. "3rd Test, Christchurch, February 12 – 16, 1965, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 17 July 2022.
  6. Alderson, Andrew (13 March 2018). "New Zealand Cricket's One Test Wonders: Peter Truscott". The New Zealand Herald. Retrieved 2 July 2020.
  7. "New Zealand Cricket Council President's XI v MCC 1965-66". CricketArchive. Retrieved 17 July 2022.

బాహ్య లింకులు మార్చు