పీపుల్స్ భారతక్క

పీపుల్స్ భారతక్క రవికిరణ్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై కోరే రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2002, నవంబర్ 29న విడుదలయ్యింది.

పీపుల్స్ భారతక్క
(2002 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోరే రవిబాబు
నిర్మాణం కోరే రవిబాబు
కథ కోరే రవిబాబు
చిత్రానువాదం కోరే రవిబాబు
తారాగణం రవిబాబు, సజని, రఘునాథరెడ్డి
సంగీతం జీవన్ థామస్
గీతరచన సుద్దాల అశోక్ తేజ, రాజనర్సయ్య, రవిబాబు
సంభాషణలు కోరే రవిబాబు
ఛాయాగ్రహణం సుధాకరరెడ్డి
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • రవిబాబు
  • సజని
  • రఘునాథరెడ్డి
  • తెలంగాణ శకుంతల
  • జీవా
  • ముక్కురాజు
  • దేవదాస్ కనకాల
  • వినోద్
  • రమ్యశ్రీ

సాంకేతికవర్గం మార్చు

  • కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: కోరే రవిబాబు
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, రాజనర్సయ్య, రవిబాబు
  • సంగీతం: జీవన్ థామస్
  • ఛాయాగ్రహణం: సుధాకరరెడ్డి

కథ మార్చు

భగత్ తీవ్రవాద దళ నాయకుడు. ఎక్కడ అన్యాయముంటే అక్కడ ప్రత్యక్షమౌతాడు. భగత్ తీవ్రవాదిగా మారక ముందు ఐ.ఎ.ఎస్.కు సెలక్టవుతాడు. ఊళ్ళో అన్యాయాలను ఎదురిస్తూ ఉంటాడు. తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాడని ఆ ఊరి ఎస్.ఐ. భగత్‌కు వ్యతిరేకంగా రిపోర్ట్ వ్రాసి ప్రభుత్వానికి పంపుతాడు. దానితో అతనికి కలెక్టర్ ఉద్యోగం రాదు. సమాజంలోని అరాచకాలతో అతడు తీవ్రవాదిగా మారిపోతాడు. ఓ ఊరి భూస్వామి భూపతి భారతిపై మనసు పడతాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి సిద్ధపడతాడు. అడ్డు వచ్చిన భర్తను, తండ్రిని చంపి తను అనుకొన్నది సాధిస్తాడు. ఆ తర్వాత భారతిపై మరోసారి అత్యాచారం చేస్తాడు. ఆమె కొడుకును కూడా కడతేరుస్తాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె దగ్గరికి భగత్ వచ్చి భూపతిపై ప్రతీకారం తీర్చుకోమని, దానికి దళంలో చేరడమే మార్గమని విప్లవ భావాలు నూరిపోస్తాడు. దళంలో చేరిన భారతి కాస్త భారతక్కగా మారిపోతుంది. భారతక్క భూపతిని చంపి తన కక్ష తీర్చుకోవడం, తమ దళం కోసం వెదుకుతున్న ఎస్పీ, హోం మంత్రులను భగత్ మందుపాతరలతో హతమార్చడం, తాను మానవబాంబుగా మారి పోలీసుల సమూహాన్ని మట్టుపెట్టడం, భారతక్క ఏఎస్పీని చంపడానికి బాంబులతో దాడిచేసి అతనితో పాటు ఆమె కూడా మరణించడం చిత్రానికి పతాక సన్నివేశం.[1]

మూలాలు మార్చు

  1. ఆనంద్ గౌతమ్‌. "మూస పంథాలో పీపుల్స్ భారతక్క (సమీక్ష)". indiancine.ma. Retrieved 19 August 2022.