పుట్ట మధు తెలంగాణ శాసనసభకు చెందిన మంథని శాసనసభ నియోజకవర్గానికి మాజీ శాసన సభ్యుడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై ఓడిపోయాడు.[2]

పుట్ట మధు
పుట్ట మధు


పెద్దపల్లి జిల్లా పరిషత్​ ఛైర్మన్​
పదవీ కాలం
5 జులై 2019
తరువాత దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నియోజకవర్గం మంథని

వ్యక్తిగత వివరాలు

జననం 1972
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి పుట్ట శైలజ[1]
మతం హిందూ మతం

బాల్యం మార్చు

ఈయన 1972 లో రైతు కుటుంబంలో జన్మించాడు. 1987- 88వ సంవత్సరంలో మంథని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్నాడు.

రాజకీయ ప్రస్థానం మార్చు

2014లో మంథని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసిన పుట్ట మధు పై గెలిచాడు.

మూలాలు మార్చు

  1. Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  2. https://puttamadhu.officialpress.in
"https://te.wikipedia.org/w/index.php?title=పుట్ట_మధు&oldid=4147666" నుండి వెలికితీశారు