పూర్ణిమ చౌదరి

పశ్చిమ బెంగాల్ కి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి

పూర్ణిమ చౌదరి పశ్చిమ బెంగాల్కి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]

పూర్ణిమ చౌదరి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పూర్ణిమ చౌదరి
పుట్టిన తేదీ (1971-10-15) 1971 అక్టోబరు 15 (వయసు 52)
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
మారుపేరుపూర్ణి
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 53)1997 డిసెంబరు 13 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1997 డిసెంబరు 24 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే
మ్యాచ్‌లు 5
చేసిన పరుగులు 20
బ్యాటింగు సగటు 20.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 11*
వేసిన బంతులు 150
వికెట్లు 6
బౌలింగు సగటు 10.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/21
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: CricketArchive, 2020 మే 8

జననం మార్చు

పూర్ణిమ చౌదరి 1971, అక్టోబరు 15న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కలకత్తాలో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

1997 డిసెంబరు 13న ఫరిదాబాదు వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. ఇందులో 13 బంతులలో 11 పరుగులు చేసింది. బౌలింగ్ లో 8 ఓవర్లు వేసి, 21 పరుగులు ఇచ్చి, 5 వికెట్లు తీసింది.[2]

కుడిచేతి బ్యాట్స్‌మెన్ గా, కుడిచేతి మీడియం పేస్ బౌలర్ గా రాణించింది.[3] భారతదేశం తరపున ఐదు వన్డే అంతర్జాతీయవన్డే అంతర్జాతీయ మ్యాచ్ లలో ఇరవై పరుగులు చేసింది. అరంగేట్రంలో ఐదు వికెట్లతో సహా మొత్తం ఆరు వికెట్లు పడగొట్టింది.[4][5]

1997 డిసెంబరు 24న ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]

మూలాలు మార్చు

  1. "Purnima Choudhary Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  2. "IND-W vs WI-W, Hero Honda Women's World Cup 1997/98, 11th Match at Faridabad, December 13, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  3. "P Choudhary". CricketArchive. Retrieved 2023-08-01.
  4. "P Choudhary". Cricinfo. Retrieved 2023-08-01.
  5. "On the ball – Bowlers who picked up fifer on ODI and T20I debut". Women's CricZone. Retrieved 2023-08-01.
  6. "AUS-W vs IND-W, Hero Honda Women's World Cup 1997/98, 1st SF at Delhi, December 24, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.