పెంపుడు జంతువులు (నవల)

పెంపుడు జంతువులు నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి రచించారు.

రచన నేపథ్యం మార్చు

పెంపుడు జంతువులు ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి మలి నవల. ఈ నవల వారం వారం వారపత్రికలో 1982లో మొదట ముద్రణ పొందింది. 2012 నవంబరులో మనసు ఫౌండేషన్ ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది[1].

అంకితం మార్చు

పతంజలి పెంపుడు జంతువులు నవలను తన అన్న సీతా రామకృష్ణరాజు, తమ్ముళ్ళు జానకి న్యాయ గౌతమశంకర్, భగవాన్ కృష్ణ మీమాంస జైమిని, వేదాంత వ్యాస ప్రసాద్, చెల్లెలు పద్మినీ రాజేశ్వరిదేవిలకు అంకితం ఇచ్చారు.

రచయిత గురించి మార్చు

ప్రధాన వ్యాసం: కె.ఎన్.వై.పతంజలి
కె.ఎన్.వై.పతంజలి(29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. ఈనాడు, ఉదయం, సాక్షి వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే దినపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు.

ఇతివృత్తం మార్చు

తొలి నవల ఖాకీవనంకు పోలీసు వ్యవస్థలోని చీకటికోణాలు ఇతివృత్తంగా స్వీకరించిన పతంజలి రెండవ నవలైన పెంపుడు జంతువులుకు పత్రికారంగంలోని తెరవెనుక విషయాలను కథావస్తువుగా ఎంచుకున్నారు. పత్రికావిలువలు నశించిపోయి దౌర్జన్యాలకు పాత్రికేయులు కొమ్ముకాయడం, తుదకు పాత్రికేయుని వ్యక్తిగత జీవితంపైనే వారు దాడిచేసి తప్పించుకోవడం వంటివి కథలోని అంశాలు.

మూలాలు మార్చు

  1. పతంజలి సాహిత్యం,మొదటి సంపుటం(నవలలు):కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.174