పెనుగొండ లక్ష్మీనారాయణ

పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయకవి. ప్రముఖ న్యాయవాది. శ్రామిక పక్షపాతి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేస్తున్నాడు.

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1954, అక్టోబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు[1]. పెనుగొండ లింగమ్మ, గోవిందరెడ్డి ఇతని తల్లి దండ్రులు. బి.ఎ., బి.ఎల్ చదివాడు. న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఇతని భార్య పేరు ఉప్పుటూరి గీత. ఈమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రచనా వ్యాసంగం మార్చు

రచయితగా :

  1. విదిత (సాహిత్యవ్యాసాల సంపుటి)
  2. అనేక (సాహిత్యవ్యాసాల సంపుటి)
  3. రేపటిలోకి (కవిత్వం)

సంపాదకుడిగా :

  1. బల్గేరియా కవితా సంకలనం
  2. అరాజకీయం కవితా సంకలనం
  3. గుంటూరు కథలు
  4. కథాస్రవంతి (నాలుగు భాగాలు)

పురస్కారాలు మార్చు

  • తెలుగు భాషాపురస్కారం
  • సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం
  • మిలీనియం లాయర్ పురస్కారం

మూలాలు మార్చు

  1. కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి (2015-07-16). "సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తిగా పెనుస్తూన్న "పెనుగొండ" (కదిలించే కలాలు)". నేటి నిజం. బైసా దేవదాసు. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 July 2015.