ప్రభావతి దేవి

భారతీయ స్వాతంత్ర ఉద్యమకారుడు

ప్రభావతి దేవి నారాయణ్ (1906 - 1973 ఏప్రిల్ 15) బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త అయిన జయప్రకాశ్ నారాయణ్ భార్య.

ప్రభావతి దేవి నారాయణ్
జననం
ప్రభావతి దేవి ప్రసాద్

1906
మరణం1973 ఏప్రిల్ 15(1973-04-15) (వయసు 66–67)
పాట్నా, బీహార్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
జీవిత భాగస్వామిలోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్
తల్లిదండ్రులు

ప్రారంభ జీవితం, కుటుంబం మార్చు

ప్రభావతి దేవి ప్రస్తుతం బీహార్‌లోని సివాన్ జిల్లాలోని శ్రీనగర్‌లో జన్మించింది. తండ్రి ప్రముఖ న్యాయవాది, బ్రజ్‌కిషోర్ ప్రసాద్, తల్లి ఫూల్ దేవి. బ్రజ్‌కిషోర్ ప్రసాద్ స్వతహాగా గాంధేయవాది, బహుశా స్వాతంత్ర్య పోరాటానికి తనను తాను అంకితం చేసుకోవడానికి జీవనాధారమైన న్యాయవాద వృత్తిని సైతం విడిచిపెట్టిన మొదటి బీహార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ప్రభావతి దేవి 14 సంవత్సరాల వయసులో జయప్రకాష్ నారాయణ్‌ని 1920 అక్టోబరులో వివాహం చేసుకుంది.[1]

వారి వివాహం తర్వాత, జయప్రకాశ్ నారాయణ్ కాలిఫోర్నియాలో సైన్స్ అధ్యయనం చేయడానికి అమెరికా వెళ్లారు, కానీ విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మార్క్సిజం అధ్యయనంలో చేరారు. ఇక ఆమె గాంధీ ఆశ్రమానికి చేరింది. అక్కడ మహాత్మా గాంధీ భార్య కస్తూరిబాయి గాంధీ ప్రభావతి దేవిని కన్న కూతురుగా చూసుకునేది.[2]

జయప్రకాష్ నారాయణ్‌ స్వదేశం తిరిగి వచ్చాక ఒక విప్లవకారుడిగా పరిగణించబడ్డాడు. దీంతో ప్రభావతి దేవి గాంధీ ధోరణి కారణంగా వారి మధ్య అనేక విభేదాలకు దారితీసింది. ఏదేమైనా, ఒకరినొకరు గౌరవించుకునేవారు. భారత దేశానికి ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగే వరకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు. ఆమె బ్రహ్మచారిగా ఉండాలని మహాత్మాగాంధీ చేత ప్రతిజ్ఞ చేయించాలని కూడా కోరింది.[3] బ్రిటిష్ వలస పాలనలో ఆమె చాలా సందర్భాలలో జైలు జీవితం గడిపారు.

భారత స్వాతంత్ర్య అనంతర జీవితం మార్చు

ప్రభావతి దేవి ప్రభావంతో జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ఉద్యమంలో చేరాడు. తద్వారా ఈశాన్య భారతదేశం, మధ్యప్రాచ్యంలో శాంతి ప్రస్తావనలలో చురుకుగా పాల్గొన్నాడు. త్వరితగతిన భారతదేశంలో మహాత్మా గాంధీ భావాలకు అనుగుణంగా అతను అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా ఎదిగాడు. ఆమె పాట్నాలో మహిళా చర్ఖా సమితిని స్థాపించారు. అనాదరణకు గురియైన మహిళలను చర్ఖా సమితిలో చేర్చారు. ఇది గాంధీ స్పిన్నింగ్ వీల్ ఉద్యమంకి నమూనా.

నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం మార్చు

ప్రభావతి దేవి జవహర్‌లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూతో అత్యంత సన్నిహితంగా ఉండేది. ఆమెకు అత్యంత విశ్వాసపాత్రురాలు కూడా. కమల నెహ్రూ ప్రభావతి దేవికి అనేక వ్యక్తిగత లేఖలు రాసేది. ప్రభావతి దేవి మరణం తర్వాత చాలా లేఖలు కమల నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి జయప్రకాష్ నారాయణ్ తిరిగి ఇచ్చారు.[4]

తమ చివరి రోజుల్లో ప్రభావతి, జయప్రకాష్ నివాసం ఉండే పాట్నాలోని కదం కువాన్ ప్రాంతంలోని ఇంటి గోడపై ఒక లేఖ వేలాడదీశారు. ఈ లేఖ 1958లో హిందూస్థానీలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభావతి దేవికి రాసిన చేతి ప్రతి. ఆ లేఖలోని సారాంశం ఏంటంటే.. ప్రభావతి బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలని, దానికి కమలా నెహ్రూ పేరు పెట్టాలని అనుకుంది. జవహర్‌లాల్‌ నెహ్రూను దానిని ప్రారంభిస్తారా అని అడిగారు. దానికి నెహ్రూ సమాధానమిస్తూ, ఆ పాఠశాల ప్రారంభం తనకు సంతోషాన్ని కలిగించే విషయం. అతను చాలాకాలంగా బాలికల విద్యకు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తన తండ్రి మోతీలాల్ నెహ్రూ లేదా అతని భార్య జ్ఞాపకార్థం ఏదైనా ఒక పాఠశాల ప్థాపించాలనుకున్నాడు. అతను దాని ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. మరో ముఖ్య అతిథితో, ఆ పాఠశాలను ప్రారంభించాలని ప్రభావతిని కోరాడు. ఆ పాఠశాల ప్రారంభమైనాక ఎలాగైనా ఒకసారి సందర్శించడానికి వస్తానని అతను ఓదార్పు సందేశాన్ని జోడించాడు.

మరణం మార్చు

చివరి రోజుల్లో ఆమె క్యాన్సర్‌తో[2] బాధపడుతూ 1973 ఏప్రిల్ 15న మరణించింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Vaidya, Prem. "Jayaprakash Narayan — Keeper of India's Conscience". LiberalsIndia.com. Archived from the original on 2012-02-05. Retrieved 2012-08-16.
  2. 2.0 2.1 Sandip Das (2005), Jayaprakash Narayan: A Centenary Volume, Mittal Publications, ISBN 978-81-8324-001-7
  3. Jayakar, Pupul (1995). Indira Gandhi, a biography (Rev. ed.). New Delhi, India: Penguin. p. 51. ISBN 978-0140114621.
  4. "That family feeling". Hindustan Times (in ఇంగ్లీష్). 2010-10-24. Retrieved 2021-09-23.