ఫైసల్ ఇక్బాల్
ఫైసల్ ఇక్బాల్ (జననం 1981, డిసెంబరు 30) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లలో పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 30 December 1981 కరాచీ, సింధ్, పాకిస్తాన్ | (age 42)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | జావేద్ మియాందాద్ (మామ)[1] | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 164) | 2001 మార్చి 8 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2010 జనవరి 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 132) | 2000 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2006 డిసెంబరు 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 డిసెంబరు 24 |
కరాచీ రీజియన్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్, సింధ్ డాల్ఫిన్స్, పాకిస్తాన్ ఎ జట్టు తరపున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ, టీ20లలో ఆడాడు.
ప్రస్తుతం కోచ్‌గా ఉన్నాడు. వివిధ టీవీ ఛానెల్‌లలో క్రికెట్ పై విశ్లేషణ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.
ప్రారంభ జీవితం, కుటుంబం మార్చు
ఇతను జావేద్ మియాందాద్ మేనల్లుడు.[2] ఇక్బాల్ భార్య దక్షిణాఫ్రికా జాతీయురాలు.[3]
క్రికెట్ రంగం మార్చు
దేశీయ క్రికెట్ మార్చు
2011 జనవరిలో కరాచీలో జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ డివిజన్ వన్ ఫైనల్స్‌కు చేరుకున్న పాకిస్తాన్ జట్టులో ఇక్బాల్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను 0 (6), 15 (26) పరుగులు చేశాడు.[4] 2017-18 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో కరాచీ వైట్స్ తరపున ఏడు మ్యాచ్‌లలో 413 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[5]
అంతర్జాతీయ క్రికెట్ మార్చు
శ్రీలంకతో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు.[6] న్యూజిలాండ్‌లో జరిగిన పాకిస్తాన్ పర్యటనలో అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించాడు.[7] 2002-03లో దక్షిణాఫ్రికాలో రెండు టెస్టులు ఆడాడు, కానీ బాగా రాణించకపోవడంతో తొలగించబడ్డాడు. రెండు సంవత్సరాల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తర్వాత, కరాచీలో జరిగిన 2005-06 టెస్ట్ సిరీస్ చివరి టెస్ట్‌లో భారతదేశంపై తన తొలి టెస్ట్ సెంచరీని సాధించి, పాకిస్థాన్ సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2006లో వెస్టిండీస్‌తో తన చివరి వన్డే ఆడాడు.[8]
కోచింగ్ కెరీర్ మార్చు
క్రికెట్ నుండి పదవీ విరమణ తరువాత ఇంగ్లాండ్ లో క్రికెట్ కోచింగ్ లో శిక్షణ పొందాడు. కొంతకాలంపాటు పిఎస్ఎల్ గత సీజన్లలో కరాచీ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్ గా, కన్సల్టెంట్‌గా పనిచేశాడు.[9]
2020 నాటికి, బలూచిస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.[10] 2022లో, అబుదాబి టీ10 ఆరవ సీజన్ కోసం నార్తర్న్ వారియర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.[11]
మూలాలు మార్చు
- ↑ "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan Test Cricket – Part 7 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
- ↑ Profile Cricinfo.
- ↑ Agha, Shaan (2 September 2013). ""They always wanted me to fail"". DAWN.COM.
- ↑ Match Retrieved 2023-09-11
- ↑ "Quaid-e-Azam Trophy, 2017/18: Karachi Whites Batting and bowling averages haji zulfiqar haider". ESPN Cricinfo. Retrieved 2023-09-11.
- ↑ "Full Scorecard of Sri Lanka vs Pakistan 3rd ODI 2000 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo.
- ↑ "Pakistan tour of New Zealand". Cricinfo.
- ↑ "Full Scorecard of Pakistan vs West Indies 4th ODI 2006 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo.
- ↑ "Miandad urges PCB to hire Faisal Iqbal as batting coach". Cricket Pakistan. 13 October 2019.
- ↑ "National T20 Cup: Faisal Iqbal reinstated as Balochistan head coach". Geo Super. 25 September 2020.
- ↑ Sharma, Avinash (23 November 2022). "Abu Dhabi T10 2022: Captains, coaches, star players and support staff of all 8 franchises in Season 6". MyKhel.
బాహ్య లింకులు మార్చు
- ఫైసల్ ఇక్బాల్ at ESPNcricinfo
- Faisal Iqbal Cricketer Official Website Archived 2 నవంబరు 2019 at the Wayback Machine
- Scorecard | Zimbabwe v Pakistan - One Day International Series First Match - 30-11-2002 00:00 | Cricket365 | Cricket News
- Scorecard | Pakistan v India - Test Series First Test - 29-01-2006 00:00 | Cricket365 | Cricket News