బందరు లడ్డు, ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం నగరానికి చెందిన లడ్డు. దీనికి ఆంధ్రప్రదేశ్ నుండి ఆహార పదార్థాలు వర్గంలో భౌగోళిక సూచనలో ఒకటిగా, భౌగోళిక సూచిక రిజిస్ట్రీ నమోదు చేసింది.[1][2]

బందరు లడ్డు
బందరు లడ్లు దృశ్య చిత్రం
వివరణశనగ పప్పు, బెల్లం పాకం, నెయ్యి తో తయ్యారు చేసిన లడ్డు
రకంహార్టికల్చర్ ఆహారం
ప్రాంతంకృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
దేశంభారతదేశం
నమోదైంది2017
పదార్థం

మల్లయ్య స్వీట్స్ అధ్యక్షుడు గౌరా వెంకటేశ్వర రావు నేతృత్వంలోని బృందావనపురం బందరు లడ్డూ తయారీదారుల సంక్షేమ సంఘం ‘బందరు లడ్డు’ కోసం భౌగోళీక గుర్తింపు ట్యాగ్ ఘనత సంపాదించారు.[3]

బందరు లడ్డూకి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. దిల్లీ సుల్తానుల కాలంలో మహారాష్ట్ర - మధ్యప్రదేశ్‌ సరిహద్దున ఉండే బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి మచిలీపట్నంలోని బందరుకు వలస వచ్చిన బొందిలీలు ఈ లడ్డు తయారీ ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. మొదట్లో సన్నకారప్పూసని తయారుచేసిన ఆ కుటుంబం.ఆ పూసని బెల్లంపాకంతో కలిపి తొక్కి లడ్డూలని తయారుచేసి తొక్కుడు లడ్లు చేశారని తయారీదారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి అమెరికా, లండన్‌తోపాటు ఐరోపా దేశాలకు ఏటా పదివేల కిలోల లడ్డు ఎగుమతి అవుతోంది.[4]

మూలాలు మార్చు

  1. ":::GIR Search:::". ipindiaservices.gov.in. Archived from the original on 8 మే 2017. Retrieved 5 May 2017.
  2. Naidu, T. Appala. "Bandar laddu gets GI tag". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 5 May 2017.
  3. "బందరు లడ్డు | కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము | ఇండియా". Retrieved 2020-08-26.
  4. "Bundar Laddu ….బందరు లడ్డు". www.telugukiranam.com. Archived from the original on 2021-06-15. Retrieved 2020-08-26.

వెలుపలి లంకెలు మార్చు