బర్వానీ

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

బర్వానీ మధ్యప్రదేశ్, బర్వానీ జిల్లాలోని పట్టణం. ఇది నర్మదా నది ఎడమ ఒడ్డున ఉంది. ఇది బర్వానీ జిల్లాకు ముఖ్యపట్టణం. పూర్వపు సంస్థానమైన బర్వానీకి రాజధాని కూడా. బర్వానీకి రోడ్డు సౌకర్యం మాత్రమే ఉంది, రైలు మార్గం లేదు.

బర్వానీ
పట్టణం
బర్వానీ is located in Madhya Pradesh
బర్వానీ
బర్వానీ
Coordinates: 22°02′N 74°54′E / 22.03°N 74.9°E / 22.03; 74.9
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాబర్వానీ జిల్లా
Area
 • Total27 km2 (10 sq mi)
Elevation
178 మీ (584 అ.)
Population
 (2011)
 • Total55,504
 • Density2,100/km2 (5,300/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
451551
టెలిఫోన్ కోడ్07290
Vehicle registrationMP-46

భౌగోళికం మార్చు

 
రాజ్‌ఘాట్, బర్వానీ

బర్వానీ 22°02′N 74°54′E / 22.03°N 74.9°E / 22.03; 74.9 వద్ద [1] సముద్ర మట్టం నుండి 178 మీటర్ల ఎత్తున ఉంది. నర్మదా నది బర్వానీ పట్టణ కేంద్రం నుండి 5 కి,మీ. దూరంలో ప్రవహిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో బర్వానీ గరిష్ట ఉష్ణోగ్రత 48°C కు చేరుకుంటుంది. ఇది మధ్య భారతదేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఒకటి.

రవాణా మార్చు

రైల్వేలు మార్చు

బర్వానీకి నేరుగా రైలు మార్గం లేదు పట్టణానికి సమీప స్టేషన్ ఇండోర్ లో ఉంది. 180 కి.మీ. దూరం లోని ఖాండ్వా వద్ద కూడా రైల్వే స్టేషన్ ఉంది. [2]

రోడ్లు మార్చు

బర్వానీ నుండి వివిధ ప్రదేశాలకు జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా రవాణా సౌకర్యం ఉంది. పట్టణం నుండి 51 కి.మీ. దూరంలో పోతున్న ఆగ్రా-బొంబాయి జాతీయ రహదారి నంబర్ మూడును కలిపేందుకు ఖాండ్వా-బరోడా ఇంటర్ స్టేట్ హైవే నెం. 26 నిర్మించారు. బర్వాని`నుండి ఇండోర్, ఖండ్వా, ఉజ్జయినీ, దేవాస్, ధార్, రత్లాం, ఖర్‌గోన్, హర్దా, ముంబై, అహ్మదాబాద్, వడోదర తదితర నగరాలకు బస్సు సౌకర్యాలున్నాయి.

జనాభా వివరాలు మార్చు

బర్వానీలో మతం
మతం శాతం
హిందూ మతం
  
85.0%
ఇస్లాం
  
10.0%
జైన మతం
  
3.0%
బౌద్ద్ధ మతం
  
1.0%
ఇతరాలు†
  
1.0%
ఇతరాల్లో
సిక్కుమతం (1.0%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] బర్వానీ జనాభా 55,504, ఇందులో 28,437 మంది పురుషులు (51%), 27,067 మంది మహిళలు (49%) ఉన్నారు.

ఆరేళ్ళ లోపు పిల్లలు 6,961 (12.54%). బర్వానీ పట్టణంలో స్త్రీ-పురుష లింగ నిష్పత్తి 952:1000. పిల్లల్లో స్త్రీ-పురుష లింగ నిష్పత్తి 919:1000. బర్వానీ పట్టణ అక్షరాస్యత 82.10%. పురుషుల అక్షరాస్యత 87.17%, స్త్రీల అక్షరాస్యత రేటు 76.80%.

ప్రముఖ వ్యక్తులు మార్చు

  • ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగం కార్యదర్శి అయిన డాక్టర్ అనిల్ కాకోద్కర్ బర్వానీలో జన్మించాడు.

మూలాలు మార్చు

  1. Falling Rain Genomics, Inc - Barwani
  2. 2.0 2.1 "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Retrieved 2015-06-18.
"https://te.wikipedia.org/w/index.php?title=బర్వానీ&oldid=3122053" నుండి వెలికితీశారు