బి.ఎన్. శాస్త్రి (భిన్నూరి నరసింహ శాస్త్రి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ ల తరువాత అంతగా పరిశోధనావాఙ్మయాన్ని అందించిన విద్వాంసుడు. మూసీ మాసపత్రిక ప్రతిక వ్యవస్థాపకులు, మూసీ పబ్లికేషన్స్ ప్రచురణ సంస్థను 1980 స్థాపించారు

జననం మార్చు

బి.ఎన్. శాస్త్రి 1932వ సంవత్సరంలో యాదాద్రి - భువనగిరి జిల్లా, వలిగొండ గ్రామంలోని ఒక సాంప్రదాయ కుటంబంలో జన్మించాడు.[1]

తొలిజీవితం మార్చు

బి.ఎన్. శాస్త్రి బాల్యంలో నల్లగొండ జిల్లా మొత్తం నిజాం వ్యతిరేక పోరాటంలో ఉంది. ఆ పోరాటం ప్రభావంతో బి.ఎన్. శాస్త్రి కూడా పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. కొంతకాలం పాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడిపాడు. ఆ సమయంలోనే రావి నారాయణ రెడ్డితో పరిచయం ఏర్పడింది. భువనగిరి, హైదరాబాద్‌ లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న శాస్త్రి 1952లో నారాయణగూడ పాఠశాలలో అధ్యాపక జీవితాన్ని ప్రారంభించాడు. తన తొమ్మిదవ ఏటనే దృష్టిపడిన పరిశోధన అనే విలక్షణ అంశంతో శాసనాలను గురించిన పరిశోధన, పరిష్కరణలు లక్ష్యంగా ముందుకు సాగాలనుకొని, 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో (ఎం.ఏ) చేరాడు.

భారతదేశ చరిత్ర - సంస్కృతీ (21 భాగాలు) మార్చు

  • 01. 1994 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 08 { ఢిల్లీ సుల్తానుల యుగము }
  • 02. 1994 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 09 { విజయనగర యుగము }
  • 03. 1995 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 10 { దక్కన్ సుల్తానుల యుగం }
  • 04. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 11 { మొగలు యుగము - 1}
  • 05. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 12 { మొగలు యుగము - 2}
  • 06. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 13 { రాజపుత్ర యుగము }
  • 07. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 14 { మరాఠ యుగము }
  • 08. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 15 { బ్రిటిష్ ఈస్ట్ ఇండియా యుగము - 1 }
  • 09. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 16 { బ్రిటిష్ ఈస్ట్ ఇండియా యుగము - 2 }
  • 10. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 17 { మహా విప్లవ యుగము }
  • 11. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 18 { వైస్రాయిల యుగము - 1 }
  • 12. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 19 { వైస్రాయిల యుగము - 2 }
  • 13. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 20 { సాంస్కృతిక పునరుజ్జీవన యుగము }
  • 14. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 21 { సంస్థానాల యుగము }

ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతీ మార్చు

  • 01. 1990 ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతీ - మొదటి భాగము
  • 01. 1975 ఆంధ్రుల సాంఘిక చరిత్ర { క్రీ.పూ 400. క్రీ. శ 1100 వరకు }

ప్రత్యేక సంచికలు మార్చు

  • 01. 1975 జీవితం - గమనం
  • 02. 1976 గ్రామ జీవనం (నాటకం)
  • 03. 1974 శాసన సంపుటి 1,2 భాగాలు
  • 04. 1984 కందూరు చోడుల శాసనములు - చరిత్ర - సంస్కృతి
  • 05. 1984 త్రిపురాంతక దేవాలయ శాసనములు
  • 06. 1985 బెజవాడ దుర్గామల్లీశ్వరాలయ శాసనములు
  • 07. 1985 ముఖలింగ దేవాలయ చరిత్ర - శాసనములు
  • 08. 1989 రేచర్ల రెడ్డి వంశచరిత్ర - శాసనములు
  • 09. 1989 గోలకొండ చరిత్ర - సంస్కృతి, శాసనములు
  • 10. 1989 చెరుకు రెడ్డి వంశచరిత్ర - శాసనములు
  • 11. 1989 రేచర్ల పద్మ నాయకులు
  • 12. 1991 కాయస్థ రాజులు
  • 13. 1991 వేములవాడ చరిత్ర - శాసనములు
  • 14. 1993 మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం
  • 15. 1994 నల్లగొండ జిల్లా కవులు - పండితులు
  • 16. 1994 మల్యాల వంశ చరిత్ర - శాసనములు
  • 17. 1998 రెడ్డి రాజ్య సర్వస్వము
  • 18. 1999 మూసీ ద్వైవార్షిక ప్రత్యేక సంచిక
  • 19. 2000 మూసీ త్రైవార్షిక ప్రత్యేక సంచిక
  • 20. 2001 పానుగల్లు పచ్చల తోరణము
  • 21. 2000 బ్రాహ్మణ రాజ్య సర్వస్వము

ఇతర ప్రచురణలు మార్చు

  • 01. షబ్నవీస్ శతజయంతి సంచిక
  • 02. విజయనగర శాసనములు సాహిత్య సాంస్కృతిక విశేషములు

పురస్కారాలు మార్చు

  1. 1997లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం

మరణం మార్చు

బి.ఎన్. శాస్త్రి 2002లో మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. జంబి. "పరిశోధక తపస్వి బి.ఎన్‌.శాస్త్రి (డాక్టర్‌ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి)". www.ejumbi.com. Retrieved 28 June 2017.[permanent dead link]
  2. "బి.ఎన్. శాస్త్రి- ఒక విజ్ఞాన సర్వస్వం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). నర్రా ప్రవీణ్ రెడ్డి. 2017-12-10. Archived from the original on 2019-04-24. Retrieved 2021-12-26.