బి.డి మిశ్రా (ఆంగ్లం:B. D. Mishra) భారత ఆర్మీలో బ్రిగేడియర్, ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.[2]

బి.డి. మిశ్రా
బి.డి. మిశ్రా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 అక్టోబరు 3
ముందు పద్మనాభ ఆచార్య

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 అక్టోబర్ 2022
ముందు సత్యపాల్ మాలిక్

వ్యక్తిగత వివరాలు

జననం (1939-07-20) 1939 జూలై 20 (వయసు 84)[1]
కఠుట, బధోది జిల్లా , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత ఉత్తరప్రదేశ్)
జీవిత భాగస్వామి నీలం మిశ్రా
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం రాజ్ భవన్ , ఇటానగర్

విద్య మార్చు

మిశ్రా అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఆ తరువాత గ్వాలియర్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్. డి పూర్తి చేసాడు. వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసు కళాశాలలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యను బోధించాడు. ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎలఎల్బీ కూడా పూర్తి చేసాడు.

కెరీర్ మార్చు

1939 లో జన్మించిన మిశ్రా, 1961 డిసెంబరులో ఇన్ఫాంట్రీ అధికారిగా భారత ఆర్మీలో చేరాడు. 1995లో ఆర్మీ నుండి పదవీ విరమణ పొందాడు.

చేపట్టిన పదవులు/పనులు మార్చు

మిశ్రా భారతదేశంలో వివిధ యుద్ధాలు, కార్యాచరణ పాత్రలలో పనిచేశాడు:

  • భారతదేశంపై చైనా దాడికి వ్యతిరేకంగా (1962)
  • నాగాలాండ్‌లో నాగ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా (1963-1964)
  • సియాల్‌కోట్ సెక్టార్‌లో పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా (1965)
  • బంగ్లాదేశ్ విముక్తిలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా (1971)
  • పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, బెటాలియన్ కమాండర్‌గా (1979-1981)
  • శ్రీలంకలోని జాఫ్నా, వవునియా అలాగే ట్రింకోమలీ (1987-1988) లో భారత శాంతి పరిరక్షణ దళానికి ప్రముఖ బ్రిగేడ్ కమాండర్‌గా LTTE కి వ్యతిరేకంగా N & G, పంజాబ్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా, NSG ఫోర్స్ కమాండర్ (1990-1995)
  • పదవీ విరమణ తర్వాత కార్గిల్ యుద్ధానికి స్వచ్ఛందంగా పాల్గొన్నారు.[3][4]

మూలాలు మార్చు

  1. "His Excellency Brigadier (Dr.) B. D. Mishra... (Retd) (Governor of Arunachal Pradesh wef. 3rd October 2017)". Arunachal Pradesh Government. Retrieved 1 December 2018.
  2. "His Excellency Brigadier (Dr.) B. D. Mishra... (Retd) (Governor of Arunachal Pradesh wef. 3rd October 2017)". Arunachal Pradesh Government. Retrieved 1 December 2018.
  3. "Who is B D Mishra?". Indian Express. 30 September 2017. Retrieved 30 September 2017.
  4. "President appoints new governors". The Times of India. 30 September 2017. Retrieved 30 September 2017.