బేలూరు

ఇది ఆలయప్రాధాన్యత కలిగిన నగరం.

బేలూరు (కన్నడ: ಬೇಲೂರು) కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఒక పట్టణం. మున్సిపాలిటి. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశావాలయం ఉంది. హొయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం. బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. ఈ బేలూరు ఒకనాడు హొయసల రాజుల రాజధాని.

బేలూరు
ಬೇಲೂರು
వేలాపురి
పట్టణం
చెన్నకేశవాలయం, బేలూరు
దేశం India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహాసన్ జిల్లా
Government
 • MLAరుద్రేశ్ గౌడ
Elevation
975 మీ (3,199 అ.)
Population
 (2001)
 • Total8,962
భాషలు
 • అధికార అధికారికకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
573 115
ఎస్.టి.డి.08177
Vehicle registrationKA-13/KA-46
Website[www.belurtown.gov.in

చరిత్ర మార్చు

 
చెన్నకేశవాలయ సముదాయం, బేలూరు
 
గరుత్మంతుడు

బేలూరు ఒకనాడు హొయసలుల రాజధాని. ఆ తర్వాత ఇక్కడ నుండి హళేబీడుకు రాజధానిని మార్చారు. ఈ హళేబీడు బేలూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలు హాసన్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిని జంట పట్టణాలుగా పిలుస్తారు. ఇవి కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలు. హొయసల రాజులు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు. బేలూరులో వైష్ణవాలయాన్ని నిర్మిస్తే, హళేబీడులో శైవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా చూడదగ్గది చెన్నకేశవాలయం. దీనిని హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. సా.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది.

ఆలయ సముదాయం మార్చు

 
జగతి వేదిక మీద ఆలయ పీఠం మొదటి భాగంపై ఏనుగుల శిల్పాలు

ఈ ఆలయ సముదాయంలో ప్రధానాలయం కేశవాలయం. ఈ కేశవాలయానికి చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు ఉన్నాయి. చెన్నకేశవాలయంలో రోజూ పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆంజనేయస్వామి, నరసింహస్వామి విగ్రహాలను చూడవచ్చు. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సబ్బురాతి (Chloritic Schist ) తో నిర్మించారు. ఇది తేలిక అకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉండి, కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుదట. అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో, వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని. ఆలయం బయట నలభై రెండడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఒక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది. నేటికీ భక్తులు ఉపయోగిస్తుంటారు. హొయసల శైలి కట్టడాలకు ఈ ఆలయం ఓ మచ్చుతునక. శ్రావణబెళగొలా, హళేబీడుతో పాటు బేలూరును కూడా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.

రవాణా సౌకర్యాలు మార్చు

రోడ్డు మార్గం
బేలూరుకు కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది.బెంగళూరు (222 కి.మీ.), హళేబీడు (16 కి.మీ.), కదూర్ (62 కి.మీ.), చిక్‌మగ్‌ళూరు (22 కి.మీ.), హాసన్ (40 కి.మీ.), హోస్పేట్ (330 కి.మీ.), మంగళూరు (124 కి.మీ.), మైసూరు (149 కి.మీ.) ల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.
రైలు మార్గం
హాసన్, బనవార, అరసికేర మొదలగునవి బేలూరుకు సమీప రైలు స్టేషన్‌లు కలిగిన ప్రాంతాలు.

వ్యవసాయం& వాణిజ్యం మార్చు

ఈ ప్రాంతం ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. వరి, కాఫీ, పెప్పర్, అల్లం, చెరకు మెదలగు పంటలు పండిస్తారు.

 
ఆలయ ఆవరణ

ఇవీ చూడండి మార్చు

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

3.Karnataka State Gazetteer 1983

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బేలూరు&oldid=3572020" నుండి వెలికితీశారు