భగవద్గీత-భక్తి యోగము

గమనిక

భగవద్గీత
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు



భక్తి యోగము, భగవద్గీతలో పన్నెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

భగవద్గీతను ప్రబోధిస్తున్న శ్రీకృష్ణుడు


అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?

కృష్ణుడు:

నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కలిగిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నన్ను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు. సంతోషం,దుఃఖం,ద్వేషం,శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు. శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు. పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు.