భూపీందర్ సింగ్

పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు

భూపీందర్ సింగ్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 29 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు, 1994లో భారతదేశం తరపున రెండు అంతర్జాతీయ వన్డేలు కూడా ఆడాడు.[1]

భూపీందర్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1965, ఏప్రిల్ 1
పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
మూలం: Cricinfo, 2006 మార్చి 6

జననం మార్చు

భూపీందర్ సింగ్ 1965, ఏప్రిల్ 1న పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

1993-94లో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని ఏడవ సీజన్, ఇరానీ ట్రోఫీ ఫైనల్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై 184 పరుగులకు 10 వికెట్లు సాధించాడు. 1994, ఏప్రిల్ 13న షార్జా వేదికగా యు.ఎ.ఇ.తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[3] 34 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. 1994, ఏప్రిల్ 13న షార్జా వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి వన్డే ఆడాడు.[4] పాకిస్తాన్‌పై ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్‌పై కొంచెం స్టిక్ తీసుకున్న తర్వాత, భూపిందర్‌ని తొలగించారు.

1987/88 - 1995/96 మధ్యకాలంలో ఫస్ట్-క్లాక్ క్రికెట్ ఆడాడు. ఇందులో 61 మ్యాచ్ లలో 70 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ తో 1,355 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 85 (నాటౌట్) సాధించాడు. 61 మ్యాచ్ లలో 10946 బంతులు వేసి 4,631 పరుగులు ఇచ్చాడు. 7/39 ఉత్తమ బౌలింగ్ తో 190 వికెట్లు తీశాడు.

భూపిందర్ సింగ్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 2005లో ఈ పదవికి నామినేట్ చేయబడ్డాడు,[5] 2006లో పదవీ విరమణ పొందేవరకు దానిని కొనసాగించాడు.[6]

భూపీందర్ సింగ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా కూడా ఉన్నాడు.

మూలాలు మార్చు

  1. "Cricinfo player page". ESPNcricinfo. Archived from the original on 29 January 2007. Retrieved 2023-08-14.
  2. "Bhupinder Singh Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  3. "IND vs UAE, Pepsi Austral-Asia Cup 1993/94, 1st Match at Sharjah, April 13, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  4. "IND vs PAK, Pepsi Austral-Asia Cup 1993/94, 3rd Match at Sharjah, April 15, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  5. "2005/06 Selection Committee Announcement". ESPNcricinfo. Retrieved 2023-08-14.
  6. "2006/08 Selection Committee Announcement". ESPNcricinfo. Retrieved 2023-08-14.

బయటి లింకులు మార్చు