మంజిష్ఠ (శాస్త్రీయ నామం: రూబియా కార్డిఫోలియా) ఒక మందు మొక్క. ఈ పుష్పించే మెక్క కాఫీ కుటుంబమైన రూబియేసీకి చెందినది. దీని వేళ్లనుండి తీసే ఎరుపు రంగు పదార్థం కోసం దీన్ని ముఖ్యంగా సాగుచేస్తారు. ఆంగ్లంలో ఈ మొక్కను కామన్ మాడ్డర్ లేదా ఇండియన్ మాడ్డర్ అని పిలుస్తారు. స్థానికంగా ఈ మొక్కను సంస్కృతం, మరాఠీ, కన్నడ, బెంగాళీ భాషలలో మంజిష్ఠ అని, గుజరాతీ, హిందీలలో మాజిత్ అని, తెలుగులో తామరల్లి అని, తమిళంలో మందిట్టి అని పిలుస్తారు.

మంజిష్ఠ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Tribe:
Genus:
Species:
ఆర్. కార్డిఫోలియా
Binomial name
రూబియా కార్డిఫోలియా

మొక్క యొక్క వర్ణన మార్చు

ఈ మొక్క ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. సతతహరితమైన ఈ మొక్క యొక్క పత్రాలు 5–10 సెం.మీల పొడవు, 2–3 సెం.మీ.ల వెడల్పు ఉండి. కేంద్ర కాండము నుండి నక్షత్రాకారంలో 4-7 ఆకులు అమరి ఉంటాయి. ఆకులమీద, కొమ్మల మీద ఉన్న చిన్న వంకుల సహాయంతో ఈ తీగ ఎగబాకుతుంది. పుష్పాలు పరిమాణంలో చిన్నగా (3–5 మి.మీల వ్యాసం) ఉండి, ఐదు లేత పసుపు రంగు దళాలు in dense racemes, ఈ మొక్క జూన్ నుండి ఆగష్టు మధ్యలో పుష్పించి, ఆ తరువాత (4–6 మిమీ వ్యాసం) కల ఎరుపు, నలుపు రంగు గల బెర్రీ ఫలాలను కాస్తుంది. ఈ మొక్క వేళ్ల ఒక మీటరు దాకా పొడవు, 12 మి.మీల మందం ఉంటాయి. ఈ ఎప్పుడూ తడిగా ఉండే బంకమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. ఈ జాతి మొక్కలను హమ్మింగ్ బర్డ్ హాక్ మాత్ (మాక్రోగ్లాసమ్ స్టెల్లటేరమ్) వంటి లెపిడాప్టెరా వర్గానికి చెందిన కీటకాల లార్వాలకు తిండిగా ఉపయోగిస్తారు.

ఉపయోగాలు మార్చు

రూబియా కార్డిఫోలియా వాణిజ్యపరంగా అతి ముఖ్యమైన మొక్క. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని అనేక ప్రాంతాలలో ఎరుపు రంగు యొక్క మూలాధారము మంజిష్ఠనే. అనాది నుండి 19వ శతాబ్దపు మధ్యభాగం వరకు దీన్ని విరివిగా సాగుచేసేవారు.

ఈ మొక్క యొక్క వేర్లు అలిజారిన్ అనే ఆర్గానిక్ పదార్ధాన్ని కలిగి ఉండి, రోజ్ మాడ్డర్ అనే ఎరుపు అద్దకపు రంగుకు ఆ రంగును సమకూరుస్తుంది. కృత్తిమంగా ఈ అద్దకపు రంగు దగ్గరగా ఉన్న, ఆంథ్రసీస్ సమ్మేళనమైన అలిజరిన్‌ను కనుగొనడంతో, సహాజసిద్ధమైన ఈ అద్దకపు రంగుకు గిరాకీ బాగా తగ్గిపోయింది.[1]

మూలాలు మార్చు

  1. "Material Name: madder". material record. Museum of Fine Arts, Boston. November 2007. Archived from the original on 2012-02-15. Retrieved 2009-01-01.
  • R. Chenciner, Madder red: a history of luxury and trade (Richmond 2000).

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మంజిష్ఠ&oldid=2888993" నుండి వెలికితీశారు