మయికేల్ విట్జల్ భాషాశాస్త్రకారుడు

భాషాశాస్త్రకారుడు, చరిత్రకారుడు, పురాణాలను పరిశోధించిన శాస్త్రవేత్త మయికేల్ విట్జల్(Michael Witzel )జర్మనీ, అమెరికా దేశాలకు చెందిన philologist, అంతేకాక, కంపేరిటివ్ mythologist, చరిత్రకారుడు, ఋగ్వేద భాషను, వ్యాకరణాన్ని అధ్యయనం చేసిన పండితుడు. ప్రత్యేకంగా, ఏకపక్షంగా, హిందూత్వ వాదులు చేసిన వాదాలను శాస్త్రీయంగా పరాస్తం చేసిన భాషాశాస్త్రవేత్త. Vedic sanskrit లోని మాండలిక పదాలమీద, వేదిక్ మతం వృద్ధిచెందిన విధానం మీద గొప్ప పరిశోధనలు చేశాడు. భారత ఉపఖండంలో linguistic prehistory మీద కూడా పరిశోధనలు చేశాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చాలాకాలం సంస్కృతం బోధించాడు. అనేక విశ్వవిద్యాలయాల్లో పదవులు, బాధ్యతలు నిర్వహించాడు. 1972 -78 లో నేపాల్-జర్మనీ సంయుక్తంగా ఖాట్మండులో అమలుచేసిన ప్రొజెక్టుకు నాయకత్వం వహించాడు.

ఆధునిక భారతీయుల సంస్కృతికి, రుగ్వేద సంస్కృతికి చాలా అంతరం ఉందని, ఋగ్వేదంలో ప్రాచీన పంజాబులోని అనార్యభాషలనించి లోన్ వర్డ్స్ గా వచ్చి చేరిన పదాలు కనబడతాయని, కానీ ఆ ప్రాచీన భాషలు నశించిపోయాయని అంటాడు. పాణిని కాలానికే injunctive రూపం తెలియదని భావిస్తాడు. సంస్కృత భాషలో ఎన్నో పదాల అర్థాలు అర్థవ్యాకోచం పొందాయని, వేరు అర్థాలను సంతరించుకొన్నవని అంటాడు. రుగ్వేద కాలంలో brihat అంటే high అని, big అని కాదట. pur సిటి కాదు, small fort. graama అంటే విలేజ్ కాదు, “wagon train, circled when resting అని.(బళ్లన్నీ ఒకచోట విప్పి, గుండ్రంగా నిలిపి ఉంచడం కావచ్చు.)రాజన్ అంటే కింగ్ కాదు, chieftain అని. papa అంటే sin but not evil।.

ఇలాగే సముద్రం అంటే ఇప్పుడు మనం వాడుతున్న అర్థంలో కాదు, samudra సముద్రం అంటే a collection of water అని అర్థమట. Michael Witzel అనేక నిదర్శనలతో ఈ విషయం నిరూపిస్తాడు.

రుగ్వేద రచయితలు ఆయా పదాలను ఏ అర్థంలో వాడారో గ్రహించాలనీ, spirit of times ను గుర్తుంచుకోవాలనీ అంటాడు. మనకు స్ఫురించే అర్థాలు, తోచే అర్థాలను counter check చేసుకోవాలనీ అంటాడు.

official defence argument: ఒక దేశ మత గ్రంథాలను, వాగ్మయాన్ని ఆదేశ చరిత్రకారులు, పండితులు మాత్రమే వ్యాఖ్యానం చేయాలని, వారికే అర్హత, సామర్థ్యం ఉంటాయని, విదేశీయులు వాటిని అర్థం చేసుకోలేరనీ కొందరు వాదిస్తారు. స్థానిక చరిత్రకారులు, శాస్త్రకారుల పరిశీలనలో అనుకూలతలున్నట్లే అననుకూలతలూ ఉంటాయని మరికొందరు అంటారు.

అసలు సమస్య ఇదికాదు, మాయా, ఈజిప్టు నాగరికతలను విదేశీ, పాశ్చాత్య పండితులే సమర్థవంతంగా అధ్యయనంచేసి అనేక ఆవిష్కరణలు చేశారు.

philological method నాగరకతలకు సంబంధించిన bias ను, ఏకపక్ష దృష్టిని అధిగమించదానికి సహాయపడుతుంది. అనేక దేశాలలో ఆయా అంశాలమీద అధ్యయనం చేస్తున్న సాటి పరిశోధకులతో తమ పరిశోధన ఫలితాలను సరిపొల్చుకొని, check చేసుకొనే అవకాశం ఉంటుంది. రుగ్వేద కాలంలో సముద్రం అన్న పదానికి ఉన్న అర్థాన్ని ఈ విధానం ద్వారా పరిశోధకులు ఏవిధంగా నిర్నయించారో వివరించాడు.

source : 1. The Hindu, Open page dated : 7-8-2002,

2. ఇంగ్షీషు వికీపీడియా