వధువరులకు పెళ్ళి అయిన తరువాత వధువరులు ఇద్దరు పెళ్ళి జరిపించిన వధువు లేక వరుడు ఇంటికి వెళ్లతారు. అనగా పెళ్ళికోసం ఖర్చు చేసిన లేక పెళ్ళి జరిపించిన పెళ్ళి కుమారుని ఇంటికి కాని లేక పెళ్ళి కుమార్తె ఇంటికి కాని వీరిద్దరిలో ఎవరు పెళ్ళి జరిస్తారో వారింటికి అప్పుడే పెళ్ళి అయిన వధువరులు పెళ్ళి మండపం నుంచి నేరుగా వెళ్లడం జరుగుతుంది. తరువాత పెళ్ళి జరిపించిన వధువరులలోని ఒక ఇంటి నుండి వధువరులలోని మరొక ఇంటికి మరలి వెళ్లడాన్ని మర్లుపెళ్ళి లేక మరలు పెళ్ళి అని అంటారు. అనగా పెళ్ళి కుమార్తె ఇంటి వారు పెళ్ళి జరిపించి ఉంటే పెళ్ళి కుమార్తె ఇంటి నుండి పెళ్ళి కుమారుని ఇంటికి మరలి వెళ్ళడాన్ని లేక పెళ్ళి కుమారుని ఇంటి వారు పెళ్ళి జరిపించి ఉంటే పెళ్ళి కుమార్తె ఇంటికి మరలి వెళ్ళడాన్ని మర్లుపెళ్ళి అంటారు.

ఎన్ని రోజులలో మార్చు

ఎక్కువగా పెళ్ళయిన రోజు నుండి మూడు రోజుల లోపల ఈ మర్లుపెళ్ళిని జరుపుకుంటున్నారు. పాత రోజులలో 16 రోజుల లోపల ఈ మర్లుపెళ్ళిని జరుపుకునేవారు.

శోభనం మార్చు

ఎవరి ఇంటి వద్ద పెళ్ళి జరిగినప్పటికి శోభనం మాత్రం పెళ్ళికుమార్తె ఇంటి వద్ద జరపడం జరుగుతుంది. మర్లుపెళ్ళి శోభనానికి ముందు అయినా వెనుక అయినా జరగవచ్చు.

ఇవి కూడా చూడండి మార్చు

పెళ్లి

శోభనము

బయటి లింకులు మార్చు