1979, డిసెంబర్ 31న జన్మించిన మలింగ బండార (Malinga Bandara) శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. 1998లో తొలిసారిగా న్యూజీలాండ్ పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. కాని గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టు నుంచి తొలిగించబడ్డాడు. 2005 మార్చిలో ఇంగ్లాండు-ఏ జట్టుపై 126 పరుగులకు 11 వికెట్లు తీసి అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.భారత్‌పై 3 టెస్టుల సీరీస్‌లో 32.98 సగటుతో 9 వికెట్లు సాధించాడు. 2006 జనవరిలో న్యూజీలాండ్ పై తొలి వన్డే ఆడినాడు. సీరీస్‌లో 23.92 సగటుతో 14 వికెట్లు సాధించి సహచరుడు ముత్తయ్య మురళీధరన్ కంటే మెరుగనిపించుకున్నాడు.

Malinga Bandara
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Herath Mudiyanselage Charitha Malinga Bandara
పుట్టిన తేదీ (1979-12-31) 1979 డిసెంబరు 31 (వయసు 44)
Kalutara, Sri Lanka
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm leg break
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 71)1998 మే 27 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2006 ఏప్రిల్ 3 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 127)2006 జనవరి 6 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2011 ఏప్రిల్ 1 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.72
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–presentBasnahira South
2006–presentRagama
2010Kent
2005Gloucestershire
2004–2005Galle
2003–2004Tamil Union
1998–2003Nondescripts
1996–1997Kalutara
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 8 31 151 137
చేసిన పరుగులు 124 160 3,430 1,126
బ్యాటింగు సగటు 15.50 12.30 20.17 17.59
100లు/50లు 0/0 0/0 1/14 0/3
అత్యుత్తమ స్కోరు 43 31 108 64
వేసిన బంతులు 1,152 1,470 20,994 5,846
వికెట్లు 16 36 431 189
బౌలింగు సగటు 39.56 34.22 25.38 24.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 14 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 2 n/a
అత్యుత్తమ బౌలింగు 3/84 4/31 8/49 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 9/– 95/– 39/–
మూలం: CricketArchive, 2011 ఫిబ్రవరి 8

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

మలింగ బండార 8 టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 39.56 సగటుతో 16 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 84 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో 15.50 సగటుతో 124 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 43 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు మార్చు

మలింగ 26 వన్డేలలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 32.25 సగటుతో 31 వికెట్లు పడగొట్టినాడు. వన్డేలలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 31 పరుగులకు 4 వికెట్లు. బ్యాటింగ్‌లో 11.72 సగటుతో 129 పరుగులు చేశాడు. వన్డేలలో అత్యుత్తమ స్కోరు 28 నాటౌట్.