ఈ మాస పత్రిక తెనాలి నుండి వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య సంపాదకుడుగా, ప్రచురణకర్తగా వెలువడింది. 1938లో మొదటి సంచిక వెలుగు చూసింది. ఈ పత్రిక జాతీయోద్యమానికి బాసటగా నిలిచింది. ఈ పత్రికలో కథలు, కవితలు, పద్యాలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. విమర్శవీధి పేరుతో పుస్తకసమీక్షలు ప్రచురించారు.

మహతి
రకంమాస పత్రిక
రూపం తీరురాయల్ సైజు
ప్రచురణకర్తవాసిరెడ్డి వేంకటసుబ్బయ్య
సంపాదకులువాసిరెడ్డి వేంకటసుబ్బయ్య
స్థాపించినది1938, ఏప్రిల్ 15/ తెనాలి
కేంద్రంతెనాలి

ఆశయం మార్చు

ప్రపంచ దృష్టినంతటిని ఉవ్వెత్తుగ ఆకర్షించుచు లోకవృత్తమును క్షణక్షణము తారుమారు చేయుచున్న వర్తమాన రాజకీయ వ్యవస్థకు జాతీయ నిత్యజీవనమునకు సంబంధించు సాంఘిక నైతికాది చర్చా సందర్భములకును, కళాపోషకములయి మానవహృదయ సంస్కారమునకు దోహదమొసగు కథానికలకును, ఆదర్శములగు చరిత్రాంశములకు మా 'మహతి' సేవాంజలి సమర్పించుచుండును అని తొలిసంచికలో 'ప్రాస్తావిక'లో ఈ పత్రిక ఆశయాన్ని ప్రస్తావించారు[1].

విషయాలు మార్చు

ఈ పత్రిక రెండవ సంపుటము రెండవ సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి[2].

మూలాలు మార్చు

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రిక, మే1938 పుట౪౬౭
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహతి సంచిక
"https://te.wikipedia.org/w/index.php?title=మహతి&oldid=3434837" నుండి వెలికితీశారు