మహాసుందరి దేవి (1922 ఏప్రిల్ 15 - 2013 జూలై 4) భారతీయ కళాకారిణి. ఆమె మధుబని చిత్రకారిణి.[2]

మహాసుందరీ దేవి
మహాసుందరీ దేవి
జననం(1922-04-15)1922 ఏప్రిల్ 15
మధుబని
మరణం2013 జూలై 4(2013-07-04) (వయసు 91)[1]
రంతి
జాతీయతభారతీయురాలు
రంగంమిథిలా పెయింటింగ్
అవార్డులుపద్మశ్రీ పురస్కారం (2011)

పెయింటింగ్ కళకు లివింగ్ లెజెండ్ గా పేరుతెచ్చుకున్న ఆమె 1995లో మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే తులసి సమ్మాన్‌(Tulsi Samman)ను అందుకుంది. అలాగే ఆమె 1982లో భారత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చేతులమీదుగా జాతీయ అవార్డును అందుకుంది. ఇలా మరెన్నో పురస్కారాలు అందుకున్న ఆమెను 2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.[3][4]

జీవిత చరిత్ర మార్చు

కేవలం అక్షరాస్యురాలు అయిన మహాసుందరీ దేవి ఆమె అత్త నుండి మధుబని కళారూపాన్ని చిత్రించడం నేర్చుకుంది.[5] 1961లో ఆ సమయంలో ప్రబలంగా ఉన్న పర్దా (ముసుగు) వ్యవస్థను విడిచిపెట్టి, కళాకారిణిగా తన స్వంత స్థానాన్ని సృష్టించుకుంది.[6] ఆమె మిథిలా హస్తశిల్ప్ కళాకర్ ఆడియోకి సహయోగ్ సమితి అనే సహకార సంఘాన్ని స్థాపించింది. ఇది హస్తకళలు, కళాకారుల అభివృద్ధికి తోడ్పడింది. మిథిలా పెయింటింగ్‌తో పాటు, ఆమె మట్టి, పేపర్ మాచే, సుజని, సిక్కిలో నైపుణ్యానికి ప్రసిద్ది చెందింది. ఆమె తన చివరి పెయింటింగ్‌ను 2011లో వేసింది. ఆమె 92 యేళ్ల వయసులో 2013 జూలై 4న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. ఆ మరుసటి రోజు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.[7]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె బీహార్‌లోని మధుబని సమీపంలో ఉన్న రంతి గ్రామ నివాసి.[6] ఆమె కోడలు బిభా దాస్, మరదలు కర్పూరి దేవి కూడా మధుబని పెయింటింగ్ కళాకారులె.[8][9]ఆమె 18 సంవత్సరాల వయస్సులో పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణ కుమార్ దాస్‌ను వివాహం చేసుకుంది.[10] వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.[8]

మూలాలు మార్చు

  1. "Padma Shree Awardee Madhubani Painting artist Mahasundari Dev died at the age of 92". Jagran Josh. Archived from the original on 24 April 2014. Retrieved 30 May 2017.
  2. "Bihar's Madhubani artists get poor returns". Hindustan Times. Hindustan Times (New Delhi). 11 October 2007.
  3. "Padma Awards Announced" (Press release). Ministry of Home Affairs. 25 January 2011. Archived from the original on 22 February 2014.
  4. "List of Padma Awardees for 2011". Mint. New Delhi. 26 January 2011. Retrieved 4 June 2020.
  5. "Doyenne of Mithila painting Mahasundari Devi dies". The Times of India. 5 July 2013. Archived from the original on 24 March 2017. Retrieved 17 September 2013.
  6. 6.0 6.1 Prakash, Manisha (29 May 2007). "India: Ladies' Fingers and a Flavour of Art". Hindustan Times. Women's Feature Service.
  7. "Madhubani painting guru cremated with state honours". Hindustan Times (in ఇంగ్లీష్). 2013-07-05. Retrieved 2020-06-03.
  8. 8.0 8.1 "Madhubani painting artist Mahasundari Devi dead". Business Standard. 4 July 2013. Archived from the original on 21 September 2013. Retrieved 17 September 2013.
  9. Jain, Somya (2018-03-18). "6 Madhubani Women Artists Who Pushed Out Dominant Narratives". Feminism In India (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-03-07.
  10. "Straight from the art". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-08-04. Retrieved 2020-06-03.