మానసవీణ మధుగీతం (పాట)

మానసవీణ మధుగీతం ఒకానొక హృద్యమైన ప్రేమగీతం. దీనిని పంతులమ్మ (1978) సినిమా కోసం వేటూరి సుందరరామమూర్తి రచించారు. దీనిని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల కలిసి గానం చేయగా రాజన్-నాగేంద్ర సంగీతాన్ని స్వరపరిచారు.

మానసవీణ మధుగీతం పాటలోని దృశ్యం.

పాటలోని సాహిత్యం మార్చు

పల్లవి :
మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం
సాగరమధనం, అమృత మధురం, సంగమ సరిగమ స్వర పారిజాతం || మానసవీణ మధుగీతం ||

చరణం :
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాన దశదిశాంతాన సుమ సుగంధాల
భ్రమర నాదాల కుసుమించు నీ అందమే
విరిసింది అరవిందమై కురిసింది మకరందమే || మానసవీణ మధుగీతం ||


జాబిలి కన్న నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను

పాల కడలిలా వెన్నెల పొంగింది
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలను
మనసున మమతై కడతేరగలను || మానసవీణ మధుగీతం ||


కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని
తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని
కలిసేదాక అనుకోలెదు తీయని స్నేహమని

పెదవి నీవుగా పదము నేనుగా ఎదలు కలపగా

అవార్డులు మార్చు

  • ఈ పాటలోని ఉన్నత విలువలున్న సాహిత్యానికి వేటూరి సుందరరామమూర్తి గారికి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం లభించింది.

బయటి లింకులు మార్చు