మార్కస్ స్టోయినిస్

మార్కస్ పీటర్ స్టోయినిస్ (జననం 1989 ఆగస్టు 16) ఆస్ట్రేలియా జాతీయ జట్టు కోసం పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే ఆస్ట్రేలియన్ క్రికెటరు. అతను దేశీయంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్ స్టార్స్‌ జట్లతో ఒప్పందం చేసుకున్నాడు. గతంలో పెర్త్ స్కార్చర్స్, విక్టోరియా తరపున ఆల్ రౌండర్‌గా కూడా ఆడాడు. [1] [2] [3] 2021 T20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్ సభ్యుడు.

మార్కస్ స్టోయినిస్
2018 లో స్టోయినిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మార్కస్ పీటర్ స్టోయినిస్
పుట్టిన తేదీ (1989-08-16) 1989 ఆగస్టు 16 (వయసు 34)
పెర్త్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా
ఎత్తు1.85 m (6 ft 1 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటింగ్ ఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 209)2015 సెప్టెంబరు 11 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.17
తొలి T20I (క్యాప్ 74)2015 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 3 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.17
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–2009/10వెస్టర్న్ ఆస్ట్రేలియా
2012/13పెర్త్ స్కార్చర్స్
2012/13–2016/17విక్టోరియా
2013/14–presentమెల్‌బోర్న్ స్టార్స్
2016–2018కింగ్స్ XI పంజాబ్
2017/18–presentవెస్టర్న్ ఆస్ట్రేలియా
2018కెంట్
2019రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2020–2021ఢిల్లీ క్యాపిటల్స్
2022–presentలక్నో సూపర్ జెయింట్స్
2022సదరన్ బ్రేవ్
2023శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 60 51 63 112
చేసిన పరుగులు 1,326 803 3,348 2,751
బ్యాటింగు సగటు 28.21 29.74 33.14 30.56
100లు/50లు 1/6 0/2 4/25 4/14
అత్యుత్తమ స్కోరు 146* 78 170 146*
వేసిన బంతులు 1,753 428 5,086 3,105
వికెట్లు 40 18 68 79
బౌలింగు సగటు 42.92 34.11 40.44 36.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/16 3/34 4/73 4/43
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 16/– 23/– 34/–
మూలం: ESPNcricinfo, 2023 ఏప్రిల్ 12

జీవితం తొలి దశలో మార్చు

స్టోయినిస్ గ్రీకు వారసత్వానికి చెందిన ఆస్ట్రేలియన్. అతను పెర్త్‌లో జన్మించాడు. పశ్చిమ ఆస్ట్రేలియాకు అండర్-17, అండర్-19 స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. [4] [5] స్టోయినిస్ 2008 ICC అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అండర్-19 క్రికెట్ జట్టు తరపున ఆడాడు. [6] మరుసటి సంవత్సరం, అతను హాంకాంగ్ సిక్స్‌లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. [7]

దేశీయ, T20 కెరీర్ మార్చు

రాష్ట్ర అండర్-23 జట్టు కోసం అనేక ఫ్యూచర్స్ లీగ్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత, స్టోయినిస్, 2008-09 ఫోర్డ్ రేంజర్ కప్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున తన లిస్టు A రంగప్రవేశం చేశాడు. అతని వన్డే, అతని షెఫీల్డ్ షీల్డ్ రంగప్రవేశాలు రెండూ గబ్బాలో క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగాయి. [8] [9] స్టోయినిస్ 2008-09 సీజన్‌లో మరో షెఫీల్డ్ షీల్డ్ గేమ్, మరో రెండు ఫోర్డ్ రేంజర్ కప్ మ్యాచ్‌లు ఆడాడు. 2009-10 సీజన్‌లో ఒక్కో పోటీలో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడాడు గానీ, కానీ క్రమం తప్పకుండా ఎంపిక కాలేదు. [10] [11]

ఆస్ట్రేలియాలో, స్టోయినిస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ గ్రేడ్ క్రికెట్ పోటీలో స్కార్‌బరో తరపున, విక్టోరియన్ ప్రీమియర్ క్రికెట్‌లో నార్త్‌కోట్ తరపున క్లబ్ క్రికెట్ ఆడాడు. [12] [13] అతను 2012 ఇంగ్లీష్ సీజన్‌లో కొంత భాగాన్ని నార్తాంప్టన్ ప్రీమియర్ లీగ్‌లో పీటర్‌బరో టౌన్ క్రికెట్ క్లబ్ తరపున ఆడి, [14] ఒక మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. [15] స్టోయినిస్ ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఐదు సెకండ్ XI ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. [16]

2012 డిసెంబరులో, గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో స్టోయినిస్ 2012–13 బిగ్ బాష్ లీగ్ సీజన్ కోసం పెర్త్ స్కార్చర్స్ జట్టులో ఎంపికయ్యాడు. [17] 2013లో, స్టోయినిస్ 2017–18 సీజన్‌కు పశ్చిమ ఆస్ట్రేలియాకు తిరిగి రావడానికి ముందు దేశీయంగా విక్టోరియాకు ప్రాతినిధ్యం వహించాడు. [18]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015 ఎడిషన్‌కు ముందు అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సంతకం చేశాడు. [19] ఆ తర్వాత 2016 సీజన్ కోసం కింగ్స్ XI పంజాబ్ వేలంలో INR 55 లక్షలకు అతన్ని పాడుకుంది.[20] 2016 మే 13న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ XI తరపున తన కెరీర్‌లో అత్యుత్తమ T20 గణాంకాలను సాధించాడు, తన నాలుగు ఓవర్లలో 4/15 స్కోరును సాధించాడు. [21] [22]

2018లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు బ్యాటింగ్‌ను శాశ్వతంగా ప్రారంభించేందుకు స్టోయినిస్ పదోన్నతి పొందాడు. ఈ చర్య వలన మంచి ప్రయోజనాలు కలిగాయి. సీజన్ ప్రారంభంలో నాలుగు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసిన స్టోయినిస్, 2018-19 బిగ్ బాష్ లీగ్‌లో స్టార్స్‌కు అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు, 53.30 సగటుతో 533 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు కూడా తీసుకున్నాడు. [23] 2020 IPL వేలానికి ముందు అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది. [24] 2020 IPL వేలంలో, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది. [25]

2020 జనవరి 5న జరిగిన మెల్‌బోర్న్ డెర్బీలో, రెనెగేడ్స్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌పై స్వలింగ సంపర్క దూషణకు స్టోయినిస్‌కి $7,500 జరిమానా విధించారు. [26] ఈ ఘటనపై పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఏం చేస్తున్నానో తెలీకుండా తెగేదాకా లాగాను’’ అని అన్నాడు.

2020 జనవరి 12న, స్టోయినిస్ సిడ్నీ సిక్సర్స్‌పై 79 బంతుల్లో 147 పరుగులు చేసి, బిగ్ బాష్ లీగ్‌లో కొత్త అత్యధిక వ్యక్తిగత స్కోరును నెలకొల్పాడు. [27] 2020 జూలైలో, అతను 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ కోసం బార్బడోస్ ట్రైడెంట్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [28] [29] 2021లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్టోయినిస్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. [30] అతను 23.66 సగటుతో 71 పరుగులు చేసి, 54.50 సగటుతో 2 వికెట్లు తీసుకున్నాడు.[31] [32]


2022 ఏప్రిల్లో, ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని సదరన్ బ్రేవ్ కొనుగోలు చేసింది. [33]

2023 మార్చిలో, యునైటెడ్ స్టేట్స్‌లో మేజర్ లీగ్ క్రికెట్ మొదటి ఎడిషన్ కోసం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌కు సంతకం చేసాడు.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

స్టోయినిస్ 2015 ఆగస్టు 31న ఇంగ్లండ్‌పై ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు.[34] అతని వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం కూడా 2015 సెప్టెంబరు 11న అదే జట్టుపై జరిగింది.[35] 2017 జనవరి 30న, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్‌డేలో, స్టోయినిస్ మూడు వికెట్లు పడగొట్టి 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటరు సాధించిన అత్యధిక వన్డే స్కోరు ఇదే. [36] అతని జట్టు ఓడిపోయినప్పటికీ, స్టోయినిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. [37]

2017 మార్చిలో, గాయపడిన మిచెల్ మార్ష్ [38] కి బదులుగా అతన్ని భారత్‌తో జరిగిన మూడవ, నాల్గవ టెస్టుల కోసం ఆస్ట్రేలియా టెస్టు జట్టులో తీసుకున్నారు గానీ, ఏ మ్యాచ్‌లోనూ ఆడించలేదు.

2018 ఏప్రిల్లో, అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా 2018–19 సీజన్ కోసం జాతీయ కాంట్రాక్టు అందజేసింది. [39] [40] 2019 జనవరిలో, అతను శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టు కోసం ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చేరాడు. [41] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. [42] [43] 2019 ప్రపంచ కప్‌లో, మొదటి నాలుగు గేమ్‌లు ఆడిన తర్వాత, స్టోయినిస్ పక్క నొప్పితో తప్పుకున్నాడు. [44]


2020 జూలై 16న, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు శిక్షణను ప్రారంభించడానికి ఎంచిన 26 మంది ఆటగాళ్ల ప్రాథమిక జట్టులో స్టోయినిస్ ఎంపికయ్యాడు. [45] [46] 2020 ఆగస్టు 14న, పర్యాటక జట్టులో స్టోయినిస్‌ను చేర్చుకోవడంతో మ్యాచ్‌లు జరుగుతాయని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. [47] [48]

మూలాలు మార్చు

  1. Marcus Stoinis: Melbourne Stars all-rounder fined after directing personal abuse at Kane Richardson, BBC Sport, 5 January 2020. Retrieved 10 April 2020.
  2. Aussie allrounder Stoinis moves to Kent for T20 campaign, The Cricketer. Retrieved 10 April 2020.
  3. Marcus Stoinis, Cricket Australia. Retrieved 10 April 2020.
  4. "Late dad's belief inspires Stoinis". PerthNow (in ఇంగ్లీష్). 2017-12-23. Retrieved 2019-12-20.
  5. Miscellaneous Matches played by Marcus Stoinis (36) – CricketArchive. Retrieved 4 December 2012.
  6. Under-19 ODI Matches played by Marcus Stoinis (3) – CricketArchive. Retrieved 4 December 2012.
  7. Jeremy Smith picked for Hong Kong Sixes Archived 2017-02-02 at the Wayback Machine – Cricket Tasmania. Published 23 October 2009. Retrieved 4 December 2012.
  8. Queensland v Western Australia, Ford Ranger Cup 2008/09 – CricketArchive. Retrieved 4 December 2012.
  9. Queensland v Western Australia, Sheffield Shield 2008/09 – CricketArchive. Retrieved 4 December 2012.
  10. First-Class Matches played by Marcus Stoinis (3) – CricketArchive. Retrieved 4 December 2012.
  11. List A Matches played by Marcus Stoinis (4) – CricketArchive. Retrieved 4 December 2012.
  12. Player Profile: Marcus Stoinis Archived 24 ఏప్రిల్ 2013 at the Wayback Machine – Western Australian Cricket Association. Retrieved 4 December 2012.
  13. Onboard Northcote Cricket Club for another season – Northcote Leader. Published 23 June 2012. Retrieved 4 December 2012.
  14. Northamptonshire Premier League Matches played by Marcus Stoinis (7) – CricketArchive. Retrieved 4 December 2012.
  15. Marcus is the hat-trick hero in Town win Archived 4 మార్చి 2016 at the Wayback Machine – Peterborough Telegraph. Published 4 August 2012. Retrieved 4 December 2012.
  16. Stoinis revives old memories with Kent T20 deal, CricInfo, 2018-03-15. Retrieved 2018-03-15.
  17. Unknown duo Hilton Cartwright and Marcus Stoinis replace injured Perth Scorchers – PerthNow. Published 4 December 2012. Retrieved 4 December 2012.
  18. Cameron, Louis (14 August 2017). "Stoinis goes west to join Warriors". Cricket.com.au. Retrieved 21 December 2017.
  19. Bolstered Delhi Daredevils look to turn the tables - Delhi Daredevils. Retrieved 22 April 2017
  20. List of players sold and unsold at IPL auction 2016 - ESPNcricinfo. Published 6 February 2016. Retrieved 22 April 2017.
  21. Stoinis stars as Kings XI crush Mumbai - ESPNcricinfo. Published 13 May 2016. Retrieved 22 April 2017.
  22. Marcus Stonis career information - ESPNcricinfo. Retrieved 22 April 2017.
  23. "Stoinis signs monster Big Bash deal". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2020-01-08.
  24. "Where do the eight franchises stand before the 2020 auction?". ESPN Cricinfo. Retrieved 15 November 2019.
  25. "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPN Cricinfo. Retrieved 20 December 2019.
  26. "CA under fire for handling of latest homophobic slur". The Daily Telegraph. Sydney. Retrieved 2020-01-08.
  27. Marcus Stoinis hits Big Bash League highest score for Melbourne Stars, BBC Sport, 12 January 2020. Retrieved 12 January 2020.
  28. "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
  29. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
  30. "IPL".
  31. "IPL". IPL. Archived from the original on 2021-11-11. Retrieved 2023-09-10.
  32. "IPL Postponed".
  33. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  34. "Australia tour of England and Ireland, Only T20I: England v Australia at Cardiff, Aug 31, 2015". ESPNCricinfo. 31 August 2015. Retrieved 31 August 2015.
  35. "Australia tour of England and Ireland, 4th ODI: England v Australia at Leeds, Sep 11, 2015". ESPNCricinfo. 11 September 2015. Retrieved 11 September 2015.
  36. Sundararaman, Gaurav (30 January 2017). "Why Marcus Stoinis' 146 was a freak innings". ESPNcricinfo. Retrieved 30 January 2017.
  37. "Stoinis stranded short of incredible heist". ESPNcricinfo. 30 January 2017.
  38. "Stoinis replaces injured Mitchell Marsh in Test squad". ESPN Cricinfo. Retrieved 8 March 2017.
  39. "Carey, Richardson gain contracts as Australia look towards World Cup". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
  40. "Five new faces on CA contract list". Cricket Australia. Retrieved 11 April 2018.
  41. "Uncapped all-rounder Marcus Stoinis replaces Matt Renshaw in Australia squad for second Sri Lanka Test". International Cricket Council. Retrieved 26 January 2019.
  42. "Smith and Warner make World Cup return; Handscomb and Hazlewood out". ESPN Cricinfo. Retrieved 15 April 2019.
  43. "Smith, Warner named in Australia World Cup squad". International Cricket Council. Retrieved 15 April 2019.
  44. "Marsh joins Cup squad to cover injured Stoinis". Cricket Australia. Retrieved 12 June 2019.
  45. "Usman Khawaja and Marcus Stoinis in expanded Australia training squad for possible England tour". ESPN Cricinfo. Retrieved 16 July 2020.
  46. "Aussies name huge 26-player group with eye on UK tour". Cricket Australia. Retrieved 16 July 2020.
  47. "Riley Meredith, Josh Philippe and Daniel Sams included as Australia tour to England confirmed". ESPN Cricinfo. Retrieved 14 August 2020.
  48. "Uncapped trio make Australia's UK touring party". Cricket Australia. Retrieved 14 August 2020.