మా మహారాజుతో దూరతీరాలు

"మా మహారాజుతో దూర తీరాలు" యాత్రా చరిత్రను కురుమెళ్ళ వెంకటరావు రచించాడు. పిఠాపురం జమీందారు దంపతులవెంట యూరపు, అమెరికా పర్యటించిన సంస్థాన ఆశ్రితుల బృందంలో ఈ యత్రాచరిత్ర రచయిత కురుమెళ్ళ వెంకటరావు కూడా ఉన్నాడు. ఆయన పిఠాపురంలోని తన ఆత్మీయ మిత్రుడు పెనుమత్స వెంకట్రావుకు రాసిన ఉత్తరాలలో తన యాత్రా విశేషాలు తెలియజేస్తూ వచ్చాడు. లేఖా రచయిత భావుకుడు, గొప్ప రచనాశక్తి కలిగిన సహృదయుడు.

లేఖల్లో కురుమెళ్ళ వెంకటరావు చూసిన మహానగరాలు, ప్రదేశాలు, జలపాతాలు , ఫ్రాన్సులో ఈఫిల్ టవర్ వంటి వింతలు, నేవ్కయోర్లిక్సి ఆకాశ హర్మ్యాలు, దేశ దేశాల మనుషులు, పొందిన అనుభవాలు అన్నీ హృద్యంగా, కవితాత్మకంగా రాశాడు. 1930 దశాబ్ది భావకవిత్వానికి పట్టంకట్టినకాలం కాబట్టి రచనంతా కవిత్వ ధోరణిలో సాగింది.

వెంకటరావు ఏడు నెలలు జమీందారు వెంట దేశదేశాలు తిరిగి, పిఠాపురం తిరిగి వచ్చిన తర్వాత ఆయన మిత్రులు ఆ ఉత్తరాలను తిరిగి లేఖారచయితకి వాపసు చేయగా, దాదాపు 35 సంవత్సరాల తరువాత ఈ లేఖావళిని ముద్రించి, పిఠాపురం రాజావరికే అంకితం ఇచ్చాడు. యాత్రా చరిత్రలలో ఈ 164పుటల రచన ఎన్నదగినది.

నిడదవోలు వెంకటరావు, గిడుగు సీతాపతి, వఝల శివశంకరశాస్త్రి, రాసిన పరిచయాలతో 166పుటలకు మించని రచన.

రచయిత సొంత ప్రచురణ, ఏవన్ ప్రింటింగ్ వర్క్స్, హైదరాబాదు, 1066.