ముప్పలనేని శేషగిరి రావు

ముప్పలనేని శేషగిరి రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యుడు,పూర్వ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు, బలిపీఠం సినిమా నిర్మాత.

ముప్పలనేని శేషగిరి రావు

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1999
ముందు చీరాల గోవర్ధన రెడ్డి
తరువాత మంతెన అనంత వర్మ
నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 18 నవంబర్ 2019
హైదరాబాద్‌
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

జీవిత విశేషాలు మార్చు

ముప్పలనేని శేషగిరిరావు 1933లో నర్సాయపాలెం లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1952 లో మాజీ పార్లమెంటు సభ్యుడు ఎన్.జి.రంగా చల్లపల్లి వద్ద స్థాపించిన రాజకీయ పాఠశాలలో చేరాడు. ఆర్థిక, వ్యవసాయ, విద్యారంగాలలో జ్ఞానాన్ని సంపాదించిన అతను 1981లో శాసన మండలి సభ్యునిగా ఎన్నకయ్యాడు.[1]

రాజకీయ జీవితం మార్చు

ముప్పలనేని శేషగిరిరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 1981 నుంచి 1985 వరకు ఎమ్మెల్సీగా పని చేశాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. శేషగిరిరావుకు 1999 ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి 1999లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటిమి చెందాడు. ఆయన ఆ తరువాత గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశాడు.

మరణం మార్చు

ముప్పలనేని శేషగిరిరావు 2019 నవంబర్ 18న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3]

మూలాలు మార్చు

  1. Reporter, Staff (2019-11-18). "Bapatla ex-MLA Seshagiri Rao dead". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-05-01.
  2. HMTV (18 November 2019). "బాపట్ల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  3. Sakshi (18 November 2019). "మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.